జగిత్యాల,అగ్నిధారన్యూస్ :కరీంనగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎల్. రమణ ఇటీవల సాధారణ వైద్య పరీక్షలు చేయించుకోగా గుండె లోని ఒక వాల్వ్ దెబ్బతిందని వైద్యులు తెలుపగా వారి సూచనల మేరకు ఆయనకు గుండె శస్త్ర చికిత్స జరిగింది. మంగళవారం రోజున సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ DCMS ఛైర్మన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి ఎమ్మెల్సీ రమణ ని తన స్వగృహంలో కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల బీసీ నాయకుడు మచ్చలేని మనిషి ఎల్.రమణ అన్నారు. ఆయన ఆరోగ్యం త్వరగా మెరుగుపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.
