బండి సంజయ్ కాదు తొండి సంజయ్

మతాల మధ్య చిచ్చు రేపుతోంది ఊరుకోం ఖబర్దార్

బిజెపి ది మతపిచ్చి రాజకీయం

దేవాలయల విషయంలో మూర్ఖంగా మాట్లాడుతున్న బండి సంజయ్

అగ్నిధారన్యూస్ ( డెస్క్  ) బండి సంజయ్‌ ని తక్షణం అరెస్ట్ చెయ్యాలని  గల్ఫ్ అధికార ప్రతినిధి ఎస్.వి.రెడ్డి  డిమాండ్ చేశారు. యువతను తప్పు తోవ పట్టిస్తున్నారు అని మండి పడ్డారు. మతకలహాలు సృష్టించే వారు ఎవరైనా సరే శిక్షలు విధించాలి అన్నారు. అభివృద్దిని పక్కకు పెట్టి మత కలహాలు లేపి ఓట్లు సంపాధించుకోవడానికి బిజేపి పార్టీ చేస్తున్న ప్రయత్నం తప్ప మరేమి లేదు అని ఆయన విమర్శించారు. ఇస్లాం దేశాలలో హిందూ దేవాలయాలు కట్టుకోడానికి అవకాశం ఇస్తుంటే ఇక్కడ భారతదేశంలో మసీదుల కింద ఏమో ఉందని మూర్ఖంగా మాట్లాడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.