అగ్నిధారన్యూస్( పెద్దపల్లిజిల్లా )విశ్వాసనీయ సమాచార మేరకు పెద్దపల్లి మండలం నిట్టూరు గ్రామం లో అన్నదమ్ముల మధ్య ఆధిపత్య పోరుతో అన్న కొడుకులు సొంత బాబాయిని కత్తులతో పొడిచిన సంఘటన జిల్లాలో సంచలనం సృష్టిస్తుంది .గత కొద్ది రోజులుగా ఆస్తి తగాదాలే ప్రధానంగా జరుగుతున్న పోరులో బడుగు సతీష్ దాదాపు ఉదయం 10:30 గంటల ప్రాంతంలో అన్న కొడుకు వెనక నుంచి వచ్చి కత్తులతో దాడి చేయగా తీవ్ర గాయాల పాలు కాగా గాయపడ్డ వ్యక్తిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

