కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే

అగ్నిధారన్యూస్( జగిత్యాల )రక్తదానం ఒక మహద్బాగ్యంగా భావిస్తూ, ఆపదలో ఉన్నవారికి అత్యవసర సమయంలో నిస్వార్థంగా రక్తదానం చేస్తున్న రక్త దాతలకు ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ అభినందనలు తెలిపారు.

ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా
ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జగిత్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో..నిర్వహించిన రక్తదాన శిబిరంలో స్థానిక యువత పాల్గొని రక్తదానం చేశారు. రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరం సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ రవి తో పాటుగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.పి.శ్రీధర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు,రెడ్ క్రాస్ జిల్లా కమిటీ కార్యదర్శి మంచాల కృష్ణ, సభ్యులు సిరిసిల్ల శ్రీనివాస్, బొడ్ల జగదీశ్ , రోటరీ  , నర్సింగ్ కళాశాల అధ్యాపక బృందం బ్లడ్ బ్యాంక్ వైద్యుడు డా.రవికుమార్, రక్తదాన మోటివేటర్ కొమురవెల్లి వేణుగోపాల్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.