అగ్నిధారన్యూస్ ( ఓదెల )

శనివారం రోజుఓదెల మండలం ఉప్పరపల్లి గ్రామంలో సి డి పి  నిధులతో ఎస్సీ కమ్యూనిటీ హల్ నిర్మాణానికి  పెద్దపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు శంఖుస్థాపన చేశారు.

ఎమ్మెల్యేగా గెలుపొంది తొలిసారి గ్రామానికి వచ్చిన విజయరమణ రావుని కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజలు, స్థానిక ప్రజాప్రతినిధులు, ఘన స్వాగతం పలికి, పూలమాలలు శాలువలతో ఘనంగా సత్కరించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ.. రానున్న ఐదు సంవత్సరాలలో నియోజకవర్గంలో పాటు.. ఉప్పరపల్లి గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని,   తెలిపారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు,  గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ, వార్డు సభ్యులు  కాంగ్రెస్ పార్టీ నాయకులు,గ్రామస్తులు  తదితరులు పాల్గొన్నారు.