పెద్దపల్లి జిల్లా డి పి ఆర్ ఓ బి. తిరుమల.
అగ్నిధారన్యూస్ పెద్దపల్లి ఆగస్టు-21:
పెద్దపల్లి జిల్లా జిల్లా పౌర సంబంధాల అధికారిణి (డిపిఆర్ఓ )గా బి.తిరుమలను కమిషనర్ నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ సందర్బంగా జిల్లా పాలనాధికారి కోయ శ్రీహర్ష ని శుక్రవారం మర్యాద పూర్వకంగా కలసి
అనంతరం పెద్దపల్లి జిల్లా డీపీఆర్వోగా బాధ్యతలు స్వీకరించారు.
బాధ్యతలు స్వీకరించిన ఆమె జిల్లా పౌర సంబంధాల శాఖ అధికారులతో సమావేశమై శాఖకు సంబంధించిన కార్యక్రమాలు, మీడియా సమన్వయం, ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల ప్రచారం తదితర అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆ శాఖ అధికారులు డి పి ఆర్ ఓ కు ఘన స్వాగతం పలికారు.
