డాక్టర్ గోలి శృతి సర్టిఫికెట్లను సమగ్ర విచారణకు డిమాండ

# పరస్పర విరుద్ధమైన ప్రకటనలు.
# ఒకే కాలంలో రెండు రాష్ట్రాల్లో విధులు ఎలా?
# టీజీఎంసీ ఎన్ఒసీ లేకుండా ఇతర రాష్ట్రంలో ప్రాక్టీస్ ఎలా?
# అత్యంత కీలకమైన అంశం – అక్టోబర్-డిసెంబర్ 2024 కాలం.
# విచారణకు డిమాండ్ చేసిన సామాజిక కార్యకర్త కందుల అశోక్.

అగ్నిధారన్యూస్ మంచిర్యాల 

మంచిర్యాల జిల్లాలోని బర్త్ రూట్ హాస్పిటల్ నిర్వహిస్తున్న డాక్టర్ గోలి శృతి ఎఆర్టీ లెవెల్ 2 అనుమతి కోసం సమర్పించిన అనుభవ సర్టిఫికెట్లపై తీవ్ర అనుమానాలు ఉన్నాయని సామాజిక కార్యకర్త కందుల అశోక్ మంచిర్యాల జిల్లా వైద్యాధికారికి సోమవారం లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును ప్రజావాణిలో స్వీకరించారు. పిర్యాదులో వీనస్, నోవా హాస్పిటల్స్ సర్టిఫికెట్లకు సంబంధించి జాయినింగ్,రిలీవింగ్ ఆర్డర్లు, శాలరీ స్లిప్స్, బ్యాంక్ స్టేట్మెంట్, గుజరాత్ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్, టీజీఎంసీ ఎన్ఒసీ పరిశీలించి,అభయ హాస్పిటల్ డెలివరీ రిజిస్టర్లు, అప్పటి ఫ్లెక్సీలు, ఫోటోలను పరిశీలించాలని. అక్టోబర్-డిసెం 2024 కాలానికి బర్త్ రూట్ హాస్పిటల్ కేసు షీట్స్ , ఫామ్ ఎఫ్ (ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ), డెలివరీ రిజిస్టర్లు, మనిశ్రీ వంటి ఇతర సెంటర్లకు రిఫర్ చేసిన రికార్డులను స్వాధీనం చేసుకుని, పేషెంట్లను నేరుగా విచారించాలని కోరారు. నకిలీ అనుభవ సర్టిఫికెట్లతో ఏఆర్టి వంటి అత్యంత సున్నితమైన అనుమతులు పొందడం ప్రజల ప్రాణాలతో చెలగాటమని, కాబట్టి నిష్పక్షపాత విచారణ జరిపి, ఆరోపణలు నిజమైతే పీసీపీఎన్డిటి, ఎఆర్టి యాక్ట్ ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ జేశారు.