పెద్దపల్లి కాంగ్రెస్‌లో ముదిరిన విభేదాలు – ఎంపీ గడ్డం వంశీకృష్ణపై చర్యలు తీసుకోవాలని TPCCకి ఫిర్యాదు.
హైదరాబాద్: అగ్నిధారన్యూస్ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఇరువురి నాయకుల మధ్య అంతర్గత పోరు అంతర్గత విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్ నాయకుల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధి సెగ్గం రాజేశం గురువారం హైదరాబాదు గాంధీభవన్ లో టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్‌కు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఆయన ఈ ఫిర్యాదు లేఖను అందజేశారు.
ప్రోటోకాల్ పాటించడం లేదు అని ఆరోపణ
సెగ్గం రాజేశం టి పి సి సి అధ్యక్షునికి చేసిన ఫిర్యాదు లేఖలో పలు సంచలన ఆరోపణలు చేశారు. ఏఐసీసీ కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర మేనిఫెస్టో కమిటీ చైర్మన్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తన సొంత నియోజకవర్గం మంథనిలో పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ పలుమార్లు వివాదాస్పద వాక్యాలు చేస్తూ పర్యటిస్తున్న తీరుపై ఆయన తన ఫిర్యాదులో అభ్యంతరం వ్యక్తం చేశారు. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కాంగ్రెస్ పార్టీకి వెన్నుముక లాంటి వాళ్లు సీనియర్ నాయకులు, జిల్లాకు మంత్రి అనే గౌరవం లేకుండా, తను మంథనిలో పర్యటించే సమయంలో కనీస ప్రోటోకాల్ పాటించకుండా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఎంపీ పర్యటించే సమయంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు , జిల్లా అధికార ప్రతినిధులు, మండల అధ్యక్షులు, స్థానిక కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు కనీస సమాచారం ఇవ్వకుండా అవమానపరుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
BRS నేతలతో సన్నిహిత సంబంధాలు
పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ తన వ్యక్తిగత వ్యాపార, రాజకీయ స్వాలంబనకోసమే ఉద్దేశపూర్వకంగా ట్రస్ట్, కులం ముసుగులో తిరుగుతున్నారని లేఖలో సంచలన ఆరోపణ చేశారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకుల అండదండలతో పార్టీ గుర్తుపై గెలిచిన ఎంపీ, కాంగ్రెస్ పార్టీకి తీవ్ర నష్టం కలిగించే విధంగా వ్యవహరిస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. మంథని నియోజకవర్గంలో ఉద్దేశపూర్వకంగా పరామర్శల పేరుతో ప్రతిపక్ష బి ఆర్ ఎస్ పార్టీ నాయకులతో సన్నిహితంగా ఉంటూ, ప్రతిపక్ష పార్టీ కుటుంబ సభ్యులను మాత్రమే పరామర్శలు చేస్తూ పార్టీకి నష్టం కలిగిస్తున్నారని తెలిపారు. దీనివల్ల మంథని నియోజకవర్గంలోని కాంగ్రెస్ కార్యకర్తలు తీవ్ర అసహనానికి గురవుతున్నారని, అభ్యంతరం వ్యక్తం చేశారు.నియోజకవర్గ ప్రజల్లో సదరు ఎంపీ కాంగ్రెస్ నేతా లేక ప్రతిపక్ష పార్టీ నేతా అనే సందేహం కలుగుతోందని రాజేష్ ఫిర్యాదులు పేర్కొన్నారు.
మంత్రిపై బహిరంగ లేఖలు – కార్యకర్తల్లో ఆవేశం
కాంగ్రెస్ పార్టీకి వెన్నుముకగా ఉండి పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీకి కార్యకర్తలకు అండగా ఉండి, తన రాజకీయ చతురత, అనుభవంతో ఉమ్మడి కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల్లో పార్టీని అత్యధిక స్థానాల్లో గెలిపించిన నాయకుడు శ్రీధర్ బాబని లేఖలో గుర్తు చేశారు. అలాంటి సీనియర్ నాయకుడిపై ఎంపీ వంశీకృష్ణ అనుభవలేమితో ఆయన ను అప్రతిష్ట పాలు చేయడానికి , అసందర్భంగా బహిరంగ లేఖలు పత్రికలకు సోషల్ మీడియాలో విడుదల చేస్తూ, వ్యంగ్యంగా విమర్శలకు దిగడం దురదృష్టకరమని అన్నారు ఆయనపై వెంటనే చర్యలు చేపట్టాలని కోరారు . ఇదే విషయంపై మంథని నియోజకవర్గంలోని మంత్రి అభిమానులు, కార్యకర్తలు తీవ్ర ఆవేశంతో ఉన్నారని లేఖలో పేర్కొన్నారు .
ఎంపీ ల్యాడ్స్( MPLANDS) నిధుల కేటాయింపు వివాదం.
ఎంపీ ల్యాండ్స్ ( MPLANDS) నిధుల విషయంలో స్థానిక మంత్రి తో ఎంపీ పరస్పర సహకారం లేకుండా, మంథని నియోజకవర్గంలో నిధులను ఇస్తాను సారం బిఆర్ఎస్ పార్టీ నాయకులకు కేటాయిస్తున్నారని ఆరోపించారు. ఎంపీ వంశీకృష్ణ ఏకపక్ష, ఒంటెద్దు పోకడ వల్ల మంథనిలో కాంగ్రెస్ పార్టీకి తీవ్ర నష్టం జరిగే ప్రమాదం ఉందని, వెంటనే విచారణ జరిపి క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని సెగ్గం రాజేశం కోరారు. ఈ కార్యక్రమంలో బెల్లంకొండ సత్యనారాయణ రెడ్డి, రామ్ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
