రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి అరెస్టు అక్రమం
కల్లెపల్లి అశోక్ కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి
అగ్నిధారన్యూస్( పెద్దపల్లి )విశ్రాంత ఐఏఏస్ , సోషల్ డెమొక్రటిక్ ఫోరం రాష్ట్ర కన్వీనర్ ఆకునూరి మురళిని పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడం తగదని , ఆయన అరెస్టును కెవిపిఎస్ కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఖండిస్తుందని పెద్దపల్లి కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కల్లెపల్లి అశోక్ ఒక ప్రకటనలో తెలిపారు. నీట మునిగిన కాళేశ్వరం ప్రాజెక్టును పరిశీలించేందుకు వెళ్తున్న మురళి బృందాన్ని మహదేవ్ పూర్ పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడం సిగ్గు చేటు అన్నారు . రాష్ట్రంలో ప్రజాస్వామిక హక్కులను కాలరాయడం అలవాటుగా మారింది అన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగట్టడాన్ని జీర్ణించుకొలేకనే మురళిని అరెస్టు చేశారన్నారు . ప్రమాణాలు కోల్పోతున్న ప్రభుత్వ విద్యను పరిరక్షించేందుకు మురళి ఉద్యమిస్తున్నా ,ఇంజినీర్ అయిన మురళి కాళేశ్వరం ప్రాజెక్టును పరిశీలించి ప్రభుత్వ అవినీతి బండారాన్ని బయట పెడుతారనే భయంతోనే అరెస్టు చేశారు అన్నారు . ఆయనను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు . ఆయనను విడుదల చేయకపోతే ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు …
