అగ్నిధారన్యూస్(  వెల్దండ )

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి ఆర్డీవో కార్యాలయంలో ఏసీబీ దాడులు 8వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడిన డివిజన్ సర్వేర్. వెల్దండ మండలం లింగారెడ్డిపల్లి గ్రామానికి చెందిన సిరాజ్ అనే వ్యక్తి తన వ్యవసాయ పొలంలో భూమి సర్వే చేయించడం జరిగింది.భూమి సర్వే పంచనామ కాపీ గురించి సర్వేయర్ వాస్యా నాయక్ 8000 లంచం డిమాండ్ చేయడంతో, సిరాజ్  ఏసీబీ అధికారులకు ఆశ్రయించాడు. శనివారం రోజు సాయంత్రం నాలుగున్నర గంటల ప్రాంతంలో ఆర్డీవో కార్యాలయంలో సర్వేయర్ కు 8000 లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకోవడం జరిగింది. ఏసీబీ అధికారి కృష్ణ గౌడ్ మాట్లాడుతూ… ఎవరైనా  అధికారి లంచం అడిగితే ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ 1047కు సంప్రదించాలని కోరారు.