అగ్నిధారన్యూస్,పాపన్నపేట:

నీట మునిగి యువకుడు మృతి చెందిన సంఘటన పాపన్నపేట మండలంలో సోమవారం చోటుచేసుకుంది.స్థానిక ఎస్ఐ నరేష్ తెలిపిన వివరాలు..రామతీర్థం గ్రామానికి చెందిన కట్ట ప్రభాకర్(25)కూలి పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు.ఈనెల 19 సోమవారం రామతీర్థం శివారులో గల మంజీరా నదిలో చేపలు పట్టేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు నీటమునిగాడు.స్థానికులు కుటుంబీకులకు సమాచారం అందించారు.అప్పటికే రాత్రి కావడంతో..మరుసటి రోజు మంగళవారం ఉదయం గజ ఈతగాళ్లతో నదిలో గాలించి మృతదేహాన్ని వెలికి తీశారు. మృతదేహాన్ని వెలికి తీసి పంచనామా నిమిత్తం మెదక్ ఏరియా ఆసుపత్రికి తరలించారు.తన భర్త మృతిపై అనుమానం ఉందని మృతుడి భార్య సంతోషి పిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.