అగ్నిధారన్యూస్ పెద్దపల్లి తెలంగాణ ఎక్సైజ్ శాఖకి స్థానిక సంస్థల ఎన్నికల తాకిడి ఎఫెక్ట్ స్పష్టంగా కనబడుతుంది. రాష్ట్రవ్యాప్తంగా 2620 మద్యం షాపులకు ప్రభుత్వం టెండర్ పిలిచింది. తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ,రిటైల్ మద్యం దుకాణాలకు గత నెల 26.09.2025 నుండి 18.10.2025 వరకు దరఖాస్తులు ఆహ్వానించారు.కాగా పెద్దపల్లి జిల్లాలో 74 మద్యం దుకాణాలకు రిజర్వేషన్ల వారీగా ఎక్సైజ్ శాఖ దరఖాస్తులు ఆహ్వానం పలికింది.. స్థానికంగా టెండర్ లో పాల్గొనేవారు, ప్రత్యక్షంగానో, పరోక్షంగానో, రాజకీయాలతో ముడిపడి ఉన్నవాళ్లు కావడం వల్ల.స్థానిక ఎన్నికల హడావిడిలో పడి మునిగి తేలుతున్నారు. ఇప్పటికీ టెండర్ షెడ్యూల్ విడుదల చేసి13 రోజులు అవుతుంది.. 17 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తులు చేసుకోవడానికి మరో 11 రోజులు మిగిలి ఉన్నాయి. నేడు బుధవారం హైకోర్టు స్థానిక ఎలక్షన్ నిర్వహణపై తీర్పు స్పష్టత ఇచ్చే అవకాశం ఉన్నందున, మద్యం దుకాణాల టెండర్లు కు చివరికి తేదీ సమీపిస్తున్నందున ఈనెల 10, 11 తేదీల నుండి దరఖాస్తుదారుల సందడి పెరిగే అవకాశం ఉంది.

దరఖాస్తుదారులు దరఖాస్తులు ఈవిధంగా చేసుకోవాలి…

1. తెలంగాణలోని 2620 రిటైల్ మద్యం దుకాణాల కేటాయింపునకు నోటిఫికేషన్ జారీ చేయబడింది.

2. లైసెన్స్ వ్యవధి: 1-12-2025 నుండి 30-11-2027 వరకు.

3. 21 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న ఎవరైనా non-refundable దరఖాస్తు రుసుముగా రూ. 3 లక్షలు చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చు.

4. దరఖాస్తులు దాఖలు చేయడానికి చివరి తేదీ: 18-10-2025

5. సంబంధిత DPEO కార్యాలయాలు మరియు కమిషనర్, ప్రొహిబిషన్ & ఎక్సైజ్ కార్యాలయంలో దరఖాస్తులు స్వీకరించబడతాయి.

6. రాష్ట్రంలో ఏ మద్యం దుకాణానికైనా కమిషనర్, ప్రొహిబిషన్ & ఎక్సైజ్ కార్యాలయంలోదరఖాస్తు చేసుకోవచ్చును.

7. పూర్తి వివరాల కోసం, దయచేసి సందర్శించండి: https://tgbcl.telangana.gov.in/ts/index.php/site/login

మద్యనిషేధ,ఎక్సైజ్ శాఖ, తెలంగాణ