సీ.ఎం.ఆర్.ఎఫ్ చెక్కుల పంపిణీ
పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం..
నియోజకవర్గ ప్రజల కోసం నిరంతం పని చేస్తున్నా…
ముఖ్యమంత్రి సహాయనిది చెక్కులు పంపిణీలో అగ్రస్థానం.
పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు
అగ్నిధారన్యూస్ పెద్దపల్లి:పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని నందన గార్డెన్స్ లో శనివారం పెద్దపల్లి నియోజకవర్గ పరిధిలోని 820 మంది సీ.ఎం.ఆర్.ఎఫ్ (ముఖ్యమంత్రి సహాయనిది) లబ్ధిదారులకు రూ.2,64,06,900/- (రెండు కోట్ల అరవై నాలుగు లక్షల ఆరు వేల తొమ్మిది వందలు) విలువ గల చెక్కులను పెద్దపల్లి మండల పట్టణానికి సంబంధించిన 133 మంది కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ లబ్ధిదారులకు రూ.1,33,15,428/- (ఒక కోటి ముప్పై మూడు వేల పదిహేను వేల నాలుగు వందల ఇరవై ఎనిమిది) విలువ గల చెక్కులను స్థానిక తహసీల్దార్ రాజయ్య నాయకులతో కలిసి పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…..
పెద్దపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా 820 మంది లబ్ధిదారులకు రూ.2.64 కోట్ల రూపాయల విలువ గల చెక్కులను పెద్దపల్లి మండలం, పట్టణానికి సంబంధించిన 133 మంది లబ్ధిదారులకు రూ.1.33 కోట్ల విలువ గల చెక్కులను స్థానిక నాయకులతో కలిసి పంపిణీ చేయడం జరిగిందని అన్నారు.పేద ప్రజల ఆనందమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. పెద్దపల్లి నియోజకవర్గాన్ని అగ్రగామిగా నింపేందుకు అహర్నిశలు కష్టపడుతున్నామని తెలిపారు. ప్రవేటు ఆసుపత్రులకు ధీటుగా పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రి వైద్యసేవలను అందిస్తుందని ప్రభుత్వ ఆసుపత్రి సేవలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలి పిలునిచ్చారు. ప్రభుత్వ ఆసుపత్రిని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తూ ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష హాస్పటల్ సూపరింటెండ్ శ్రీధర్ తో కలిసి నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నామని గుర్తు చేశారు. కోట్ల రూపాయలను వెచ్చించి అధునాతన హంగులతో ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకలకు ఆధునీకరణ చేస్తున్నామని అన్నారు. ముఖ్యమంత్రి సహాయనిధి కోసం దరఖాస్తు చేసుకునే వారికి అన్ని రకాల సౌకర్యాలను తమ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేశామని ప్రజలు దరఖాస్తు చేసుకోవచ్చని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ ఆసుపత్రులపై దృషి సారించి వాటిని అభివృద్ధి పరుస్తున్నారని ప్రజలందరూ ప్రభుత్వ ఆసుపత్రి సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో పెద్దపల్లి తహసీల్దార్ రాజయ్య, వ్యవసాయ మార్కెట్ చైర్మన్లు ఈర్ల స్వరూప, మినుపాల ప్రకాష్ రావు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.