విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపుడే లక్ష్య

*20 సంవత్సరాల నుండి కోటికి పైగా శిక్షణ*

*విద్యార్థులకు సూచనలు చేసిన సినీ నటి సమీరా రెడ్డి,ప్రణీత*

అగ్నిధారన్యూస్ (కల్వకుర్తి)
దేశవ్యాప్తంగా ప్రాథమిక అక్షరాస్యత, గణిత నైపుణ్యాలను బలోపేతం చేయడానికి రెండు దశాబ్దాలకు పైగా నిరంతరాయంగా కృషి చేస్తున్న పి జి శిక్ష లక్ష్యంతో సాగుతున్న ప్రత్యేక శిక్షణ శిబిరానికి ముఖ్య అతిథిగా సినీ తారలు ప్రణీత , సమీరా రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లా,కడ్తాల్ మండలం మైసిగండిలోని గిరిజన ప్రభుత్వ పాఠశాలలో పి జి శిక్షణ అందిస్తున్న
ఎర్స్ లేర్నింగ్ గ్యాప్ లక్ష్యంతో కోటి మంది జీవితాల్లో మార్పు తీసుకువచ్చిందని దేశంలోని వెనుకబడిన ప్రాంతాల చిన్నారి విద్యార్థుల చదువును మెరుగు పరచడమే లక్ష్యంగా తమ కృషిని కొనసాగిస్తోందనీ చదువులో వెనుకబడటం అనే సమస్యపై గళమెత్తుతూనే ఒక తరగతి గది నుండి కోటి ప్రయాణాల వరకు దేశవ్యాప్తంగా కోటి మంది పిల్లలను చేరుకుని, వారి జీవితాల్లో సానుకూల మార్పును తెచ్చినట్లు ప్రకటించింది.గత రెండు దశాబ్దాలుగా పాఠశాలల మౌలిక సదుపాయాలను కల్పించడమే కాకుండా, మారుతున్న విద్యా వ్యవస్థ అవసరాలకు అనుగుణంగా అభ్యసన లోపాలను నివారించడం వాటిని సరిదిద్దడంపై దృష్టి సారించి సమగ్రమైన మార్పులను తీసుకొస్తున్నట్లు పి జి ఇండియా సీనియర్ డైరెక్టర్ రజత్ బ్రార్ పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న సినీ తారలు సమీరారెడ్డి , ప్రణీత మాట్లాడుతూ. చదువులో వెనుకబాటుతనం ఎక్కడైతే ఎక్కువగా కనిపిస్తుందో సరైన సహాయం అందిస్తే ఎక్కడైతే గొప్ప మార్పు వస్తుందో అటువంటి ప్రాంతాలకు ప్రతీకగా ఈ పాఠశాలను వేదికగా ఎంచుకున్నారు. కేవలం చదవడమే కాకుండా అర్థం చేసుకుంటూ చదవడం ఎంత ముఖ్యమో వివరించడానికి విద్యావేత్తలు, భాగస్వాములు నిపుణులు వెల్లడించారు.పి జి డైరెక్టర్ రజత్ పాల్గొన్నారు

.