చీకటిని చెదరగొట్టి వెలుగు చూపేది సైన్సే–గంగవరం రామకృష్ణారెడ్డి.
అగ్నిధార న్యూస్ వనపర్తి జిల్లా :
వనపర్తి జిల్లా కేంద్రంలోని లిటిల్ ఫ్లవర్ హైస్కూల్లో శనివారం సైన్స్ డే సందర్భంగా సైన్స్ ఫెయిర్‌ను ఘనంగా నిర్వహించారు. ఈకార్యక్రమానికి వనపర్తి జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ) ఎండి అబ్దుల్ హమీద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సైన్స్ నిత్యజీవితంలో మానవాళికి అపారమైన సేవలు అందిస్తోందని తెలిపారు. శాస్త్రీయ దృక్పథం పెంపొందితేనే దేశం పురోగమిస్తుందని, విద్యార్థులు సైన్స్‌ను కేవలం పాఠ్యాంశంగా కాకుండా జీవన విధానంగా స్వీకరించాలని సూచించారు. సైన్సును సద్వినియోగం చేసుకుని కొత్త ఆవిష్కరణలతో సమాజ అభివృద్ధికి దోహదపడాలని పిలుపునిచ్చారు.
ఆత్మీయ అతిథిగా హాజరైన తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) వనపర్తి జిల్లా ప్రధాన కార్యదర్శి గంగవరం రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, “సైన్స్ అంటే సత్యాన్వేషణ. చీకటిని తొలగించి వెలుగు వైపు నడిపించేది సైన్సే” అనిఅన్నారు. ప్రపంచానికి మార్గదర్శకులైన శాస్త్రవేత్తలను ఈ సందర్భంగా స్మరించుకుంటూ, ప్రతి విద్యార్థి కూడా శాస్త్రవేత్తలా ఆలోచించి కొత్త విషయాలను అన్వేషించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో వనపర్తి మండల విద్యాధికారి మద్దిలేటి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు నీలం పాపయ్య నాయుడు, ట్రాస్మా నాయకులు జావిద్, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు ప్రదర్శించిన సైన్స్ ప్రాజెక్టులు అతిథులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
