“మే 21న ఒక్కరోజే 15 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు…..”
” 21.05.2026 నాటికి జిల్లాలో 2.67 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు”
30,690 మంది రైతుల నుంచి రూ.634.82 కోట్ల విలువైన ధాన్యం సేకరణ.
సీఎంఆర్ బియ్యం సరఫరాలో రాష్ట్రంలో అగ్రస్థానంలో పెద్దపల్లి.
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాం.
ధాన్యం కొనుగోళ్ల పై పత్రికా ప్రకటన విడుదల చేసిన జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష.
అగ్నిధారన్యూస్ పెద్దపల్లి, మే-22:
జిల్లాలో రబీ 2025-26 సీజన్‌కు సంబంధించిన ధాన్యం కొనుగోళ్లు సజావుగా కొనసాగుతున్నాయని, మే 21న ఒక్కరోజే 15 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.జిల్లాలో మొత్తం 1,77,915 ఎకరాల్లో వరి సాగు చేయగా, అందులో దొడ్డు రకం 1,65,461 ఎకరాలు, సన్న రకం 12,454 ఎకరాలు ఉన్నాయని తెలిపారు. మొత్తం 4,06,174 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా నిర్ణయించినట్లు పేర్కొన్నారు.జిల్లాలో 311 ధాన్యం కొనుగోళ్ల కేంద్రాల ద్వారా కొనుగోళ్లు నిర్వహిస్తున్నామని, ఇప్పటివరకు 3,32,500 మెట్రిక్ టన్నుల ధాన్యం కేంద్రాలకు చేరుకోగా, అందులో 2,67,929 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు పూర్తయిందన్నారు. ఇందులో దొడ్డు రకం 2,67,075 మెట్రిక్ టన్నులు, సన్న రకం 854 మెట్రిక్ టన్నులు ఉన్నాయని పేర్కొన్నారు.కొనుగోలు చేసిన ధాన్యాన్ని వేగంగా రైస్ మిల్లులకు తరలిస్తున్నామని, ఇప్పటివరకు 2,65,824 మెట్రిక్ టన్నుల ధాన్యం మిల్లులకు తరలించగా, కేంద్రాల్లో కేవలం 2,105 మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే నిల్వలో ఉందన్నారు.జిల్లాలో మొత్తం 30,690 మంది రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేయగా, కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) ప్రకారం ధాన్యం విలువ రూ.634.82 కోట్లుగా నమోదైందన్నారు.ఓపీఎంఎస్ డేటా నమోదు ప్రక్రియలో భాగంగా 29,411 మంది రైతులకు సంబంధించిన 2,34,318.320 మెట్రిక్ టన్నుల ధాన్యం వివరాలు నమోదు చేయబడగా, ఇది మొత్తం కొనుగోళ్లలో 87 శాతంగా ఉందన్నారు. అలాగే 27,762 మంది రైతులకు సంబంధించిన 2,22,408.560 మెట్రిక్ టన్నుల ధాన్యానికి మిల్లర్ల అంగీకారం నమోదై, దీని విలువ రూ.527.24 కోట్లుగా ఉందన్నారు.ఇప్పటివరకు 26,493 మంది రైతులకు సంబంధించిన 2,13,439.360 మెట్రిక్ టన్నుల ధాన్యానికి రూ.505.70 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేయగా, రూ.129.12 కోట్ల చెల్లింపులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు.ధాన్యం తరలింపునకు 580 ట్రక్కులను ఏర్పాటు చేయడంతో పాటు, ఆర్టీఏ అధికారుల సహకారంతో ట్రాక్టర్లను కూడా వినియోగిస్తున్నామని తెలిపారు. జిల్లాలో 124 రైస్ మిల్లులు ఓపీఎంఎస్‌లో ట్యాగ్ చేయబడ్డాయని పేర్కొన్నారు.ధాన్యం కొనుగోలు కేంద్రాలకు ఇప్పటివరకు 88,02,000 గన్నీ బ్యాగులు పంపిణీ చేయగా, గోదాముల్లో అదనంగా 4 లక్షల గన్నీలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.మే 21న ఒక్కరోజులోనే 15,005 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జిల్లాలో రైతుల నుండి భారీ స్థాయిలో ధాన్యం కొనుగోళ్లు నిర్వహించినట్లు కలెక్టర్ తెలిపారు. 2024-25 ఖరీఫ్ సీజన్‌లో 2,97,379 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రూ.689.78 కోట్ల విలువతో కొనుగోలు చేయగా, రైతులకు రూ.114.72 కోట్ల బోనస్ చెల్లించినట్లు పేర్కొన్నారు. అలాగే 2024-25 రబీ సీజన్‌లో 4,01,118 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రూ.925 కోట్ల విలువతో కొనుగోలు చేసినట్లు తెలిపారు. 2025-26 ఖరీఫ్ సీజన్‌లో 3,54,174 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రూ.845.89 కోట్ల విలువతో కొనుగోలు చేసి, రైతులకు రూ.155.23 కోట్ల బోనస్ చెల్లించినట్లు వెల్లడించారు. సీఎంఆర్ బియ్యం సరఫరాలో కూడా పెద్దపల్లి జిల్లా రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలిచిందని కలెక్టర్ తెలిపారు. 2024-25 ఖరీఫ్ సీజన్‌లో 1,99,592.652 మెట్రిక్ టన్నుల సీఎంఆర్ బియ్యం సరఫరా చేసి 100 శాతం లక్ష్యాన్ని పూర్తి చేసినట్లు తెలిపారు. అలాగే 2024-25 రబీ సీజన్‌లో 2,97,915.128 మెట్రిక్ టన్నుల సీఎంఆర్ బియ్యం సరఫరా చేసి 94 శాతం ప్రగతి సాధించినట్లు పేర్కొన్నారు. 2025-26 ఖరీఫ్ సీజన్‌లో 1,12,923.616 మెట్రిక్ టన్నుల సీఎంఆర్ బియ్యం సరఫరా చేసి 38 శాతం, 2025-26 రబీ సీజన్‌లో 3,179.667 మెట్రిక్ టన్నుల సీఎంఆర్ బియ్యం సరఫరా చేసి 2 శాతం ప్రగతి నమోదైనట్లు తెలిపారు.
