ఇచ్చిన మాట చేతల్లో చూపుతున్నాం…

బిఆర్ఎస్ పదేళ్ల హయాంలో పేదలకు అన్యాయం…

త్వరలోనే రెండో దశ ఇండ్ల మంజూరు…

ఇండ్లకు రూ.5 లక్షల ఆర్థిక సహాయం దేశంలో తెలంగాణ లోనే అమలు…

ప్రభుత్వ విప్ పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు

అగ్నిధారన్యూస్ పెద్దపల్లి
సుల్తానాబాద్ మండలం భూపతిపూర్ గ్రామంలో నిర్మాణాలు పూర్తి చేసుకున్న ఇందిరమ్మ ఇండ్లను సోమవారం అధికారులు ప్రజాప్రతినిధులతో కలిసి తెలంగాణ ప్రభుత్వ విప్ పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు ప్రారంభించారు.

ఈ సందర్భంగా విజయరమణ రావు మాట్లాడుతూ…

మొదటి విడత ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులతో కలిసి గృహప్రవేశాలలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. గత పది సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో ఇండ్లు మంజూరి చేయకుండా పేదలు అన్యాయానికి గురయ్యారని అన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం అర్హులైన అందరికీ ఇండ్లు ఇస్తున్నామని చెప్తాం అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం చేతల్లో చూపే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని స్పష్టం చేశారు. ఈ జూన్ మాసంలో రెండవ దశ ఇండ్ల మంజూరు జరుగుతుందని తెలిపారు. నియోజకవర్గంలో అర్హులైన అందరికీ విడతల వారీగా ఇండ్లు మంజూరు చేస్తామన్నారు. ఇంటి నిర్మాణాలకు లబ్ధిదారులకు రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందించిన ఘనత దేశంలో ఒక్క రేవంత రెడ్డి ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి పూర్తిగా పేదలు, రైతుల పక్షపాతి అన్నారు.అలాగే, గతంలో ఇందిరమ్మ ఇండ్లు అసంపూర్తిగా నిర్మించుకున్న వారికి, స్లాబ్ వేసుకొని వారికి కొత్తగా అవకాశం కల్పిస్తున్నట్టు చెప్పారు. పేదలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఒకవైపు ప్రజలకు సంక్షేమ పథకాలు, మరోవైపు గ్రామ గ్రామాన అభివృద్ధి పనులతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పాలనలో దూసుకు వెళ్తోందని విజయ రమణారావు అన్నారు.సుల్తానాబాద్ మండలం రూరల్ గ్రామాల్లో 770 ఇండ్లు మంజూరు కాగా 200 ఇండ్లు నిర్మాణాలు ప్రారంభించకపోవడంతో అధికారులు రద్దు చేశారని చెప్పారు. ఇందులో 140 నిర్మాణాలు పూర్తి అయ్యాయని, మిగిలిన వాటిలో 90 శాతం పూర్తి కావస్తున్నాయని చెప్పారు. నెలన్నర రోజుల్లోగా అన్ని ఇండ్లకు ప్రారంభోత్సవాలు జరుగుతాయని అన్నారు.

ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్,పలు గ్రామాల సర్పంచ్ లు, వార్డు సభ్యులు స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు హౌసింగ్ డీఈఈ,ఏఈ తదితరులు పాల్గొన్నారు.