పత్తాలేని సీసీ కెమెరాలు.
రెండు నెలలవ్యవధిలో భారీ దొంగతనం.
అగ్నిధారన్యూస్ సుల్తానాబాద్
సుల్తానాబాద్ మండల కేంద్రంలోని సుద్దాల గ్రామానికి చెందిన మహమ్మద్ రఫొద్దీన్ గత వారం రోజుల క్రిందట భూమి అమ్మిన డబ్బులు ఐదు లక్షల 87 వేల రూపాయలు ఇంట్లో బీరువాలో పెట్టి బక్రీద్ సందర్భంగా ఊరికి వెళ్లడంతో మంగళవారము రోజున ఇంటి తలుపులు తెరిచి ఉండగా చుట్టుపక్కల వారు ఆయనకు సమాచార అందించడంతో హుటాహుటిన ఇంటికి వచ్చి బీరువాలో ఉన్న డబ్బులను వెతకగా దొంగతనం జరిగిందని తెలుసుకొని సుల్తానాబాద్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం…? ఇది ఇలా ఉంటే గత రెండు నెలల కిందట ఓ రైతుకు చెందిన గొర్లు దొంగతనానికి గురయ్యాయని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. సుద్దాల గ్రామంలో ఈ దొంగతనం జరగడం రెండు నెలల వ్యవధిలో రెండోసారనీ ప్రజలు అంటున్నారు. గ్రామ పంచాయతీ పాలకవర్గం సీసీ కెమెరాల పట్ల నిర్ణయం తీసుకొని ముఖ్యకూడళ్ళలోబిగించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. సుల్తానాబాద్ మండలం కేంద్రంలోని చాలా గ్రామాలలో సీసీ కెమెరాలు పత్తాకు లేకుండా పోయాయని గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు.
