వైద్య సేవలలో దూసుకుపోతున్న పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రి.

జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష చొరవ, ఎమ్మెల్యే విజయ రమణారావు సహకారం గొప్పవి.

వివరాలు వెల్లడించిన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె. శ్రీధర్.

అగ్నిధారన్యూస్ పెద్దపల్లి జిల్లా
ఒకప్పుడు ప్రభుత్వ దవఖానకు వెళ్లాలంటే ప్రజలు ప్రాణాలు అరిచేతుల్లో పెట్టుకుని వెళ్లేవారు. కారణం సరియైన వైద్య సౌకర్యాలు లేకపోవడం వైద్యులు అంతాగా పట్టించుకోకపోవడం, అటు వెళ్తే ఇంటికి వస్తామో రామో తెలవని పరిస్థితి, పేద మధ్యతరగతి ప్రజలు ప్రైవేట్ ధావఖానాల మెట్లకి వైద్యం చేయించుకోవాలంటే అందని ద్రాక్ష అని తెలిసిన విషయమే,ఇంతకు ముందు మేముపోము బిడ్డో, సర్కార్ దవాఖానకు, అనే నానుడి నుండి నేడు, మేము వెళ్తే, పెద్దపల్లి సర్కార్ దవాఖానకె వెళ్తాం అనేంతగా మార్పు, ఇంత పెద్ద ఎత్తున వైద్యం కోసం ప్రజలు ఆస్పత్రికి వస్తున్నారంటే,ఈ మార్పు ఒక్కరోజులోనే జరగలేదు. రోజులు, నెలల, తరబడి నిరంతర కృషి ప్రజలకు ప్రభుత్వ వైద్యంపై నమ్మకం కల్పించడం ద్వారా ఈ మార్పు సాధ్యమైంది. నేడు పేద,మధ్యతరగతి ప్రజలే కాదు, అత్యంత సంపన్నులు ఈ దావఖానాలో వైద్య సేవలు పొందుతున్నారు. ఇంత గొప్ప మార్పుకి,స్పందనకి ముఖ్య కారణం పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అని కచ్చితంగా చెప్పాలి. లాగే పెద్దపల్లి శాసన సభ్యులు చింతకుంట విజయ రమణ రావు సహాయ సహకారాలతో…

ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె. శ్రీధర్ నిరంతర పర్యవేక్షణ వల్ల నేడు పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రి పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్ కు దీటుగా ఇక్కడి వైద్యులు, వైద్య సేవలు అందిస్తున్నారు. పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రి రోజు రోజుకి అధునూతన వైద్య సేవలతో ప్రజల్లోకి మారుమూల గ్రామాల్లోకి హాస్పటల్ ఖ్యాతి దూసుకుపోయింది. జిల్లా ప్రజల్లో నమ్మకం కలిగింది. అందుకే ఇంత పెద్ద మార్పు. గడిచిన ఫిబ్రవరి నెలలో ఆసుపత్రిలో నమోదు అయిన సేవల వివరాలు .మొత్తం 22447 మంది ఔట్ పేషెంట్లు ఆసుపత్రిలో వైద్య సేవలు పొందారు, ఇందులో 9758 మంది జనరల్ మెడిసిన్ విభాగంలో, 660 మంది జనరల్ సర్జరీ విభాగంలో, 4263 మంది చిన్న పిల్లల విభాగంలో, 3364 మంది గైనిక్ విభాగంలో, 410 మంది ఆర్థో విభాగంలో, 1509 మంది కంటి విభాగంలో, 675 మంది ఈ ఎన్ టి విభాగంలో, 1039 మంది చర్మ విభాగంలో మరియు 574 మంది దంత విభాగంలో వైద్య సేవలు పొందారు. అదే విధంగా 1872 మంది ఇన్ పేషెంట్లు గా వైద్య సేవలు పొందారు, ఇందులో 849 మంది జనరల్ మెడిసిన్ విభాగంలో, 50 మంది జనరల్ సర్జరీ విభాగంలో, 433 మంది చిన్న పిల్లల విభాగంలో, 273 గైనిక్ విభాగంలో, 90 మంది ఆర్థో విభాగంలో మరియు 174 మంది కంటి విభాగంలో ఇన్ పేషెంట్ వైద్య సేవలు పొందారు.వీటితో పాటు,54 ఆర్థో శస్త్ర చికిత్సలు, 81 జనరల్ సర్జరీ శస్త్ర చికిత్సలు, 164 కంటి శస్త్ర చికిత్సలు, 25 చెవి ముక్కు గొంతు శస్త్ర చికిత్సలు 409 డెంటల్ శస్త్ర చికిత్సలు అందినాయి. గడిచిన నెలలో మొత్తం 184 డెలివరీలు జరిగాయి. అదేవిధంగా 27859 ల్యాబ్ టెస్టులు, 2062 అల్ట్రా సౌండ్ స్కానింగ్, 133 టిఫ్ఫా స్కానింగ్, 722 ఈ సి జి, 255 2 డి ఎకో, 1880 ఎక్స్ రే, 724 ఫిజియో థెరపీ,నవజాత శిశువులకు ఇప్పటి వరకు దాదాపుగా
700 మంది శిశువుల కి ట్రీట్మెంట్ చెయ్యడం జరిగింది.
308 ఆరోగ్య శ్రీ సేవలు అందించడం జరిగింది.
వీటితో పాటు ప్రత్యేకంగా
8 లాప్రోస్కోపిక్ శస్త్ర చికిత్సలు
1 యూరాలజీ శస్త్ర చికిత్స
9 రూట్ కెనాల్ శస్త్ర చికిత్సలు చేయడం జరిగింది.
పెద్దపల్లి జిల్లా ప్రజలు పెద్దపల్లి ఆసుపత్రిలో అందుతున్న అన్ని రకాల వైద్య సేవలు ఉపయోగించుకోవాలి అని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె. శ్రీధర్ మంగళవారం ఒక పత్రిక ప్రకటనలో తెలిపారు. అదే విధంగా సేవలలో రోగులకు ఏమైనా ఇబ్బందులు ఎదురైతే నేరుగా తనను సంప్రదించవచ్చు అని తెలిపారు.హాస్పిటల్ లో
ఎక్కడైనా ఏదైనా సేవలలో ఇబ్బంది కలిగినా,లేదంటే పేషెంట్ సర్వీస్ గురించి ఏమైనా సలహాలు, సూచనలు ఉంటె ఇవ్వాలని ఆ ప్రకటనలో తెలిపారు.