నూతన పోలీస్ స్టేషన్ల ఏర్పాటుకు స్థలాల పరిశీలన… ప్రభుత్వ విప్ చింతకుంట విజయ రమణారావు.
పోలీస్ స్టేషన్ల నిర్మాణానికి అనువైన స్థలాలపై సమగ్ర నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు.
అగ్నిధార పెద్దపల్లి, ఎలిగేడు: జూన్-14
పెద్దపల్లి నియోజకవర్గం ఏర్పాటు చేయనున్న నూతన పోలీస్ స్టేషన్ల భావన నిర్మాణాలకి ప్రతిపాదించిన స్థలాలను ఆదివారం ప్రభుత్వ విప్ పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయ రమణారావు పరిశీలించారు. ప్రభుత్వ విప్ వెంట పెద్దపల్లి
జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఉన్నారు. ఎలిగేడు మండలంలో ఏర్పాటు చేయనున్న నూతన పోలీస్ స్టేషన్కు , పెద్దకల్వల లోని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సమీపంలో ఏర్పాటు చేయనున్న నూతన పోలీస్ స్టేషన్ , పెద్దపల్లి లోని వ్యవసాయ మార్కెట్ లోని మహిళా పోలీస్ స్టేషన్ , బంధంపల్లి గ్రామంలో ఏర్పాటు చేయనున్న పెద్దపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ లను ఏర్పాటు చేయబోయే స్థలాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ చింతకుంట విజయ రమణారావు మాట్లాడుతూ….
ప్రజలకు మరింత మెరుగైన భద్రతా సేవలు అందించేందుకు నూతన పోలీస్ స్టేషన్ల ఏర్పాటు అవసరమని తెలిపారు. శాంతిభద్రతల కాపాడడంలో పోలీసుల పాత్ర కీలకమన్నారు. పోలీస్ స్టేషన్ల నిర్మాణానికి సంబంధించి అనువైన స్థలాల ఎంపికపై సమగ్ర నివేదికను సోమవారం సాయంత్రం లోపు సమర్పించాలని సంబంధిత అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు.నూతన పోలీస్ స్టేషన్ల ఏర్పాటు ద్వారా ప్రజలకు పోలీస్ సేవలు మరింత చేరువవుతాయని, శాంతిభద్రతల పరిరక్షణలో ఇది కీలకంగా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్, పెద్దపల్లి మున్సిపల్ చైర్మన్ నూగిళ్ల మల్లయ్య , సుల్తానాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రకాష్ రావు, పెద్దపల్లి రెవెన్యూ డివిజన్ అధికారి బి. గంగయ్య, పోలీస్ అధికారులు,సంబంధిత శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

