నోరు జారిన మిషన్ భగీరథ ఏఈ అభిషేక్ ..
పెద్దపల్లి ఆర్ కే గార్డెన్‌లో మండల సర్వ సభ్య సమావేశంలో రసాభాస.
అగ్నిధారన్యూస్ పెద్దపల్లి
మండల సర్వసభ్య సమీక్ష సమావేశంలో భాగంగా మిషన్ భగీరథ ఏ ఈ అభిషేక్ తన శాఖ గురించి తెలిపారు..అంతరం గంట రమేష్ రంగాపూర్ సర్పంచ్ తన ఊరి నీటి సమస్య గురించి మాట్లాడుతూన్న క్రమంలో మీ ఊరికి నేను రాను.. నేను మీకు సమాధా చెప్పాను అంటూ చేసిన వ్యాఖ్యలు సమావేశంలో ఒక్కసారి తీవ్ర దుమారాన్ని లేపాయి.
పెద్దపల్లి పట్టణంలోని RK గార్డెన్‌లో మంగళవారం జరిగిన సమావేశంలో రంగాపూర్ సర్పంచ్ గంట రమేష్ తన ఆవేదనను వ్యక్తం చేశారు.
ఆ ఊరికి నేను రాను”
“మండల సర్వ సభ్య సమావేశంలో. రంగాపూర్ గ్రామానికి నేను రాను’ అని సమాధానం ఇవ్వడంతో ఒక్కసారీ సమావేశంలో గందరగోళ వాతావరం నెలకొంది.
గతంలో కలెక్టర్‌కు ఫిర్యాదు
AE నిర్లక్యంగా సమాదనం ఇవ్వడమే కాకుండా గతంలోనూ తనపైన కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు అని రమేష్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులను గౌరవించకపోవడం బాధాకరం అన్నారు.
సర్పంచ్ కు బాసట –
RK గార్డెన్ సమావేశానికి హాజరైన మండలంలోని పలువురు సర్పంచ్‌లు సర్పంచ్ రమేష్‌కు సంఘీభావం ప్రకటించారు. “ఒక సర్పంచ్‌ను అవమానించడం అంటే అందరూ ప్రజాప్రతినిధులను అవమానించడమే అన్నారు. పెద్దపల్లి సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు సంపత్ రావు ae చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా ఖండించారు.
మిషన్ భగీరథ నిధులు కోట్లలో ఖర్చు చేస్తున్నా, గ్రామాలలో అక్కడక్కడ మంచినీళ్లు అందడం లేదని, అధికారుల నిర్లక్ష్యమే ఇందుకు కారణమని సర్పంచ్‌లు మండిపడ్డారు. మండల ప్రత్యేక అధికారి భావ్ సింగ్ అభివృద్ధి అధికారి శ్రీనివాస్, తహసిల్దార్ రాజయ్య.. కల్పించుకొని సమస్యను సర్దు మణిగించారు..

పెద్దపల్లి RK గార్డెన్‌లో జరిగిన మండల సర్వ సభ్య సమావేశంలో మిషన్ భగీరథ AE తీరును ఖండిస్తున్న సర్పంచ్ గంట రమేష్ మరియు సర్పంచ్‌లు`
