అగ్నిధారన్యూస్ వనపర్తి జిల్లా
రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, పెండింగ్‌లో ఉన్న బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ విశ్రాంత ఉద్యోగుల సంఘం వనపర్తి జిల్లా నాయకులు మంగళవారం హైదరాబాద్‌కు బయలుదేరారు. ఈ సందర్భంగా ఆర్టీసీ కాలనీ సర్కిల్ వద్ద వారిని వనపర్తి పోలీసులు అడ్డుకుని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. హెడ్ కానిస్టేబుల్ సత్యనారాయణ ఆధ్వర్యంలో ఈ చర్య చేపట్టినట్లు తెలిపారు. స్టేషన్‌కు తరలించిన వారిలో ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగ నాయకులు రామచంద్రరెడ్డి, సత్యనారాయణ గౌడ్, సత్తయ్య, ఇస్మాయిల్ పాషా, బీవీ రావు తదితరులు ఉన్నారు. సంఘం నాయకులు ప్రభుత్వ హామీల అమలుతో పాటు తమకు రావాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
