అగ్నిధారన్యూస్ పెద్దపల్లి జిల్లా
పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ ఎంపీఓ ఆరిఫ్ ను జిల్లా కలెక్టర్ 09.03.2026 తేదీన పెద్దపల్లి జిల్లా పంచాయతీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కాల్వ శ్రీరాంపూర్ ఎంపీఒగా సూపరింటెండెంట్ కు బాధ్యతలు అప్పగిస్తూ కలెక్టర్ ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పరిపాలన సౌలభ్యం కోసం డిప్యూటేషన్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది అని ఉత్తర్వుల్లో తెలిపారు. ఈ ఉత్తర్వులు తక్షణమే అమలు కావాలని ఆదేశించారు. గతంతో పాటు ఇటీవల ఎంపీఓపై అనేక ఆరోపణలే బదిలీకి కారణమైనట్లు తెలుస్తుంది పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.