విధులకు గైరాజర్… తొలగింపు హెచ్చరికతో నోటీస్

విధులకు డుమ్మా కొట్టిన రికార్డ్ అసిస్టెంట్ కు షోకాజ్ నోటీసు

19 నెలలుగా గైర్హాజర్ సర్వీస్ నుంచి తొలగింపు హెచ్చరికతో కలెక్టర్ నోటీసు.

జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష.

అగ్నిధారన్యూస్ పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ రెవెన్యూ కార్యాలయంలో విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ అనధికారికంగా దీర్ఘకాలికంగా గైర్హాజరైన ఉద్యోగిపై పెద్దపల్లి జిల్లా కలెక్టర్ బుధవారం కొరడా ఝళిపించారు. కమాన్ పూర్ తహసీల్దార్ కార్యాలయంలో రికార్డ్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న కె. చిరంజీవికి సర్వీస్ నుంచి తొలగింపు (Removal from Service) హెచ్చరికతో షోకాజ్ నోటీసు జారీ చేశారు.
తేదీ: 09.09.2026న రిఫ్ నెం. A3/794/2024 ద్వారా ఈ నోటీసు జారీ అయింది. ఇందులో పేర్కొన్న వివరాల ప్రకారం, కమాన్ పూర్ మండల రికార్డ్ అసిస్టెంట్ కె. చిరంజీవి 01.02.2025 నుండి ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం లేకుండా విధులకు గైర్హాజరయ్యారు.
దీనిపై కమాన్ పూర్ తహసీల్దార్ లేఖ నెం. A/01/2024, తేదీ: 25.04.2026 ద్వారా కలెక్టరేట్ కు నివేదించారు. అనధికార గైర్హాజరుపై వివరణ కోరుతూ జారీ చేసిన మెమోలను స్వీకరించేందుకు, సంప్రదించేందుకు చేసిన ప్రయత్నాలకు కూడా సదరు ఉద్యోగి స్పందించలేదు. దీంతో తహసీల్దార్ కోరిక మేరకు ఈ కార్యాలయ ప్రొసీడింగ్స్ నెం. A3/794/2026, తేదీ: 02.05.2026 ద్వారా సదరు ఉద్యోగిని సర్వీస్ నుండి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
ఈ నేపథ్యంలో http://G.O.Ms.No.9, General Administration (Services-C) Department, తేదీ: 23.01.2026 ప్రకారం, తెలంగాణ సివిల్ సర్వీసెస్ (క్లాసిఫికేషన్, కంట్రోల్ అండ్ అప్పీల్) రూల్స్ 1991లోని నిబంధనల ప్రకారం “సర్వీస్ నుండి తొలగింపు” అనే శిక్షను విధించేందుకు ప్రతిపాదించబడింది.
అందువల్ల ప్రతిపాదిత శిక్షను ఎందుకు విధించకూడదో, అందుకు గల సరైన మరియు సముచిత కారణాలతో కూడిన వివరణను సమర్పించవలసిందిగా ఇందుమూలంగా కోరడమైనది.
ఈ షోకాజ్ నోటీసు అందుకున్న తేదీ నుండి 15 రోజుల్లోగా దిగువ సంతకం చేసిన అధికారికి అందే విధంగా వివరణ సమర్పించవలెను. నిర్ణీత గడువులో ఎటువంటి వివరణ సమర్పించని పక్షంలో, సమర్పించేందుకు ఎటువంటి వివరణ లేదని భావించి, రికార్డులో అందుబాటులో ఉన్న సమాచారాన్ని ఆధారంగా చేసుకుని ప్రతిపాదించిన శిక్షను విధించేందుకు తదుపరి చర్యలు చేపట్టబడతాయని నోటీసులో పేర్కొన్నారు.