ట్రాన్స్ఫార్మర్ల ….
చుట్టూ కంచెలు చేపట్టాలి
పెద్దపల్లి జిల్లాలో 27 సబ్ డివిజన్లో 18785 ట్రాన్స్ఫార్మర్లు.
సింహభాగం ట్రాన్స్ఫార్మర్లు ప్రమాదకరంగా.. కంచెలు లేకుండా, హెచ్చరిక బోర్డు లేకుండా దర్శనమిస్తున్నాయి.
పంట పొలాలు, రహదారుల పక్కన జన సమూహాల మధ్య ఎలాంటి హెచ్చరిక బోర్డులు లేకుండా వదిలేశారు.
చేగొండ రవి కుమార్ యాదవ్ అగ్నిధార ప్రతినిధి
పెద్దపల్లి, అగ్నిధార న్యూస్: పెద్దపల్లి జిల్లాలో నిధుల లేమినో విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యమో, పట్టింపులేని తనమో కానీ, జిల్లాలో ప్రధాన రహదారుల పక్కన, పంట పొలాలలో జన సమూహాల మధ్య ఉన్న , ట్రాన్స్ఫార్మర్లకు రక్షణ కంచెలు, హెచ్చరిక బోర్డులు లేకుండా గాలికి వదిలేశారు.జిల్లాలో 27 సబ్ డివిజన్ ల పరిధిలో 18785 ట్రాన్స్ఫార్మర్లు ఉన్నాయి. ఇందులో సింహభాగం ట్రాన్స్ఫార్మర్లు ప్రమాదకరంగా.. కంచెలు లేకుండా, హెచ్చరిక బోర్డు లేకుండా, చుట్టూ గడ్డి పెరిగి నిర్వహణ లోపంతోఎటువంటి రక్షణ చర్యలు చేపట్టకుండా ప్రమాదకరంగా దర్శనమిస్తున్నాయి.
*కానరాని రక్షణ కంచెలు, హెచ్చరిక బోర్డులు :*
నిబంధనల ప్రకారం ప్రతి ట్రాన్స్ఫార్మర్ చుట్టూ ఇనుప కంచె, పైన ప్రమాద హెచ్చరిక బోర్డు తప్పనిసరిగా ఉంచాలి. కానీ జిల్లాలో ఎక్కడ చూసినా ట్రాన్స్ఫార్మర్లకు కనిపించవు.
పొలాల వెంట తిరిగే రైతులు, పశువుల కాపర్లు, రోడ్ల వెంట వెళ్లే వాహనదారులు, ట్రాన్స్ఫార్మర్లను చూసి భయాందోళన చెందుతున్నారు. ప్రస్తుత వర్షాకాలంలో రక్షణ చర్యలు లేకపోవడం కరెంట్ లీకేజీ భయంతో పొలాల్లోకి వెళ్లే రైతులు వణికిపోతున్నారు.
*ప్రమాదం జరిగితే పరిహారం..!*
దురదృష్టవశాత్తు అనుకోని ప్రమాదం జరిగి ఎవరైనా మృతి చెందితే, ఎనిమిది లక్షల రూపాయలు, పశువులు గేద నలభై వేలు, మేకకు 7000 వేల రూపాయలు విద్యుత్ శాఖ అధికారులు హడావుడిగా నష్టపరిహారం ప్రకటిస్తారు. కానీ ప్రాణ నష్టం జరగకముందే… రక్షణ కంచెలు ఎందుకు ఏర్పాటు చేయడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. పరిహారం కంటే ప్రాణ రక్షణే ముఖ్యమనే విషయాన్ని అధికారులు ఎందుకు విస్మరిస్తున్నారో తెలుపాలని రైతు సంఘా నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రాణాలకు హరించేలా ట్రాన్స్ఫార్మర్లు
పెద్ద బొంకూర్ నుండి కొలనూరు వెళ్లే దారిలో కొత్తపల్లి వద్ద రోడ్డు పక్కనే ట్రాన్స్ఫార్మర్ ఏళ్ల తరబడి ఉన్నప్పటికీ కనీసం రక్షణ కంచ హెచ్చరిక బోర్డు లేకపోవడం విస్మయాన్ని కలిగిస్తుంది ప్రతినిత్యం వందలాదివాహనాలు స్కూల్ పిల్లల బస్సులు ఈ దారి గుండా వెళ్తుంటాయి. దురదృష్టవషత్తు వాహనాలు అదుపుతప్పి రోడ్డును ఆనుకొని ఉన్న ట్రాన్స్ఫార్మర్ ని ఢీకొన్నట్లయితే ఎంతటి ప్రమాదం వాటిల్లుతుందో చెప్పాల్సిన పనిలేదు. కొత్తపల్లి ఉప్పరపల్లి కు వెళ్లే మధ్యలో రోడ్డు పక్కనే ట్రాన్స్ఫార్మర్ ఉండడం రక్షణ చర్యలు లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
*ప్రజల డిమాండ్:*
ఇప్పటికైనా , విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు, ఎస్ ఇ వెంటనే స్పందించి, జిల్లాలోని ప్రమాదకరంగా ఉన్న ట్రాన్స్ఫార్మర్లకు తక్షణమే రక్షణ కంచెలు, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి, ప్రజల ప్రాణాలను కాపాడాలని జిల్లా కలెక్టర్ కు ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇదే విషయమై పెద్దపల్లి ఎస్ ఈ గంగాధర్ ను అగ్నిధార ప్రతినిధి చరవాణిలో వివరణ కోరగా…. ప్రమాదకరంగా ఉన్న ట్రాన్స్ఫార్మర్ల వద్ద రక్షణ చర్యలు చేపడతామన్నారు. అధికారులతో ఫీల్డ్ వెరిఫికేషన్ చేపిస్తామన్నారు. ప్రజలు తమ దృష్టికి వచ్చిన సమస్యను నేరుగా తనకు తెలుపవచ్చు అన్నారు.
మంథని మండలం బిట్టుపల్లి వద్ద.
ఓదెల మండలం ఉప్పర పల్లె గ్రామానికి వెళ్లే దారిలో
పెద్దపల్లి మండలం కొత్తపల్లికి వెళ్లే రహదారి పక్కన
