రోగుల నుంచి డబ్బులు ఆశించినట్లు ఫిర్యాదులు వస్తే సంబంధిత సిబ్బందిని విధుల నుంచి తొలగిస్తాం.

మెరుగైన వైద్య సేవలతో ఎన్టీపీసీ, చెన్నూరు నుంచి జిల్లా ఆసుపత్రికి వస్తున్న ప్రజలు.

జిల్లా ఆసుపత్రిలోని అన్ని విభాగాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కోయ శ్రీహర్ష కలెక్టర్.

అగ్నిధారన్యూస్ పెద్దపల్లి, సెప్టెంబర్-01:

అనాతి కాలంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన పెద్దపల్లి జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రి, జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ప్రత్యేక చొరవతో ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రీధర్ పర్యవేక్షణలో ప్రజలకు కార్పొరేట్ హాస్పిటల్స్ దీటుగా వైద్య సేవలో అందుతున్నాయి. మంగళవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ప్రభుత్వ హాస్పటల్ ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పారిశుధ్య సిబ్బంది డబ్బులు ఆశిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఆసుపత్రిలోని వివిధ విభాగాలను క్షుణ్ణంగా పరిశీలించారు. చిన్నపిల్లల వార్డు, గర్భిణీల వార్డు, ఎక్స్‌రే గది, ఔట్‌పేషెంట్ విభాగం, చికిత్స విభాగం, డెంటల్ విభాగం, ఇన్‌పేషెంట్ విభాగం, జనరల్ ఫిజీషియన్, ఆర్థోపెడిక్స్ తదితర అన్ని విభాగాలను పరిశీలించారు. ఆయా విభాగాల్లో రోగులకు అందుతున్న వైద్య సేవలు, సిబ్బంది పనితీరు, పారిశుధ్య నిర్వహణ తదితర అంశాలను ఆయన పరిశీలించారు.
ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలపై రోగులు, వారి సహాయకుల నుంచి కలెక్టర్ నేరుగా ఫీడ్‌బ్యాక్ తీసుకున్నారు. వైద్యం, మందుల లభ్యత, పారిశుధ్యం, సిబ్బంది వ్యవహారశైలిపై వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. జిల్లా ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందుతున్నందుకు సంతృప్తి వ్యక్తం చేశారు. మెరుగైన వైద్య సేవలు అందుబాటులో ఉండటంతో ఎన్టీపీసీ, చెన్నూరు ప్రాంతాల నుంచి ప్రజలు వైద్యం కోసం పెద్దపల్లి జిల్లా ఆసుపత్రికి వస్తున్నారని తెలిపారు. ఆసుపత్రికి వచ్చే ప్రతి ఒక్కరికి నాణ్యమైన వైద్యం అందేలా అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఆసుపత్రిలో పారిశుధ్య సిబ్బంది రోగుల నుంచి డబ్బులు ఆశిస్తున్నారనే ఫిర్యాదులు తరచుగా వస్తున్న నేపథ్యంలో ఆకస్మిక తనిఖీ నిర్వహించినట్లు కలెక్టర్ తెలిపారు. రోగుల నుంచి స్వీకరించిన ఫీడ్‌బ్యాక్‌ను పరిశీలించి, ఫిర్యాదులు నిజమని తేలితే సంబంధిత సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.ఆసుపత్రికి వచ్చే రోగులు, వారి సహాయకుల నుంచి ఎలాంటి రూపంలోనూ డబ్బులు ఆశించరాదని పారిశుధ్య సిబ్బందిని హెచ్చరించారు.పారిశుధ్య సిబ్బంది తమ పనితీరును మార్చుకుని బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని ఆదేశించారు. రోగుల నుంచి డబ్బులు ఆశిస్తున్నట్లు ఫిర్యాదులు వస్తే సంబంధిత సిబ్బందిని విధుల నుంచి వెంటనే తొలగించేలా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఆసుపత్రి పరిసరాలు ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉండేలా చూడాలని, రోగులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. వైద్య సేవల నాణ్యత, రోగుల సంతృప్తిపై నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాలని సూచించారు.
పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట డిజిహెచ్ఎస్ డాక్టర్ శ్రీధర్,సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.