అగ్నిధారన్యూస్ పెద్దపల్లి: ఈనెల 21 న ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు పెద్దపల్లి ఎన్ఎస్ పంక్షన్ హాల్లో సీనియర్ ఎమ్మార్పీఎస్ ఆద్వర్యంలో సమావేశం నిర్వహించనున్నట్లు రాష్ట్ర నాయకులు గొర్రె రాజయ్య, తోకల మల్లేష్, దాసరి ఎల్లయ్య, మాతంగి గీత తెలిపారు. పెద్దపల్లి ప్రెస్ క్లబ్ లో గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సుదీర్ఘ కాలం పాటు ఎస్సీ వర్గీకరణ కోసం సాగిన ఉద్యమ ఫలితంగా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఎబిసిడి వర్గీకరణకు ఆమోదం తెలపడం, అమలుకు చర్యలు చేపట్టడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి, సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. సమావేశానికి దేవని సతీష్ మాదిగ, అల్లారం రత్నం హాజరవుతున్నట్లు చెప్పారు. ఈ సమావేశానికి పెద్ద సంఖ్యలో వివిధ రంగాల్లోని మాదిగ జాతి మేధావులు, సంఘాల నాయకులు, మాదిగలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు.