అగ్నిధారన్యూస్ పెద్దపల్లి కలెక్టరేట్, లీజు గడువు అయిపోయినా తన భూమిలో నిల్వ ఉంచిన ఇసుకను తీయాలని ఎన్నిసార్లు చెప్పినా లీజుకు తీసుకున్న వ్యక్తి స్పందించడం లేదని, వెంటనే తన భూమిలో నిల్వ ఉన్న ఇసుకను ఖాళీ చేయించాలని పెద్దపల్లిలో సోమవారం ప్రజావాణిలో అదనపు కలెక్టర్ వేణుకు వినతిపత్రం అందజేసినట్లు మంథని ముత్తారం మండలం అడవి శ్రీరాంపూర్ గ్రామానికి చెందిన గట్టు భూమయ్య తెలిపారు. ఈమేరకు పిర్యాదు కాపీలను పెద్దపల్లి ప్రెస్ క్లబ్ కు అందజేశాడు.తన భూమిని ఇసుక రీచ్ కోసం కౌలుకు తీసుకున్న వ్యక్తి 2 ఏళ్ళు కౌలు చెల్లించి రీచ్ నిలిపివేయడంతో గత 2 ఏళ్లుగా కౌలు ఇవ్వకుండా దాదాపు 200 లారీలు ఇసుక నిల్వ ఉంచాడని అదనపు కలెక్టరుకు వివరించినట్లు తెలిపాడు. సదరు వ్యక్తికి ఎన్నో సార్లు చెప్పినా పట్టించుకోకపోవడంతో ముత్తారం పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేయగా వాయిదాల పేరుతో దాటవేస్తున్నాడని భూమయ్య ఫిర్యాదులో పేర్కొన్నారు. అధికారులు తన సమస్యను పరిష్కరించి ఇసుకను ఖాళీ చేయించాలని వినతి పత్రంలో కోరాడు.