జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్.
అగ్నిధారన్యూస్(రామగిరి మండలం)
పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం ఎంపీఓను విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించి, నిధుల వినియోగం సరిగ్గా చేయనందున,ప్రోటోకాల్ నిబంధనలు పాటించని రామగిరి ఎంపిఓ కే.భాస్కర్ ను పంచాయతీ రాజ్ శాఖ సంచాలకులకు జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సరెండర్ చేశారు.
రామగిరి మండల పంచాయతీ అధికారిగా విధులు నిర్వహిస్తున్న కే.భాస్కర్ ను వెంకట్రావుపల్లి గ్రామానికి ప్రత్యేక అధికారిగా విధులు నిర్వహించిన సమయంలో మాజీ ఎంపీటీసీ బి.శ్రీనివాస్ గౌడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు జిల్లా పంచాయతీ అధికారి ఆధ్వర్యంలో నిర్వహించిన విచారణలో రూ.4,05,396/- అభ్యంతరకర ఖర్చులు , రూ.15,045/- నిబంధనలకు వ్యతిరేకంగా ఖర్చు చేసిన రూ.15,045/- లను చలాన్ రూపంలో గ్రామ పంచాయతీకి తిరిగి చెల్లించడం జరిగింది. మంథని డివిజనల్ పంచాయతీ అధికారి సమర్పించిన నివేదిక ప్రకారం 2023-24 సంవత్సరంలో వెంకట్రావుపల్లె గ్రామానికి కేటాయించిన రూ.95,55,259/- నిధులు ఇప్పటి వరకు అసలు ఖర్చు కాలేదు. అలాగే రామగిరి ఎంపీపీ దేవక్క కొమురయ్య గౌడ్ ప్రోటోకాల్ నిబంధనలు సైతం పాటించడం లేదని ఫిర్యాదు అందించిన నేపథ్యంలో విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న రామగిరి మండల పంచాయతీ అధికారి కే. భాస్కర్ ను పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖకు కలెక్టర్ సరెండర్ చేశారు.
