పెద్దపల్లిలోని మినీ ట్యాంక్ బండ్ ను పరిశీలించిన సీపీ.

 మండపాలను ఏర్పాటుకు  

 ఆన్లైన్ లో అనుమతులు తీసుకోవాలి.

 రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ .

అగ్నిధారన్యూస్ (పెద్దపల్లి రామగుండం కమిషనరేట్)

రానున్న వినాయక చవితి, నవరాత్రి ఉత్సవాలు, గణేష్ నిమజ్జనం, మిలాద్ ఉన్ నబి సందర్భంగా రామగుండం పోలీస్ కమిషనర్ కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీనివాస్ పెద్దపల్లి డిసిపి చేతన, పెద్దపల్లి ఏసీబీ గజ్జి కృష్ణ,   పెద్దపల్లి మున్సిపల్ కమిషనర్ వెంకటేష్, లతో కలిసి పెద్దపల్లి పట్టణంలో శుక్రవారం రోజు పర్యటించారు, వినాయక నిమజ్జనం ఏర్పాట్లలో భాగంగా మినీ ట్యాంక్ బండ్ ను పరిశీలించి నిమజ్జనం రోజు క్రేన్స్ ఎక్కడ ఎక్కడ ఏర్పాటు చేయాలి, నిమజ్జనానికి వచ్చే వాహనాల రూట్ ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణ ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ట్రాఫిక్ బందోబస్తు ఏర్పాటు గురించి మున్సిపల్ కమిషనర్ పోలీస్ అధికారులతో చర్చించారు.ఈ సందర్భంగా సిపి శ్రీనివాస్ మాట్లాడుతూ… రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి మంచిర్యాల జోన్ పరిధిలోని అన్ని వర్గాల మత పెద్దలతో గణేష్ చతుర్థి, మిలాద్- ఉన్- నబీ ల పండుగ ల దృష్ట్యా శాంతి సంక్షేమ కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది అన్నారు. పోలీస్ స్టేషన్ల వారీగా పీస్ కమిటీ, మండపాల నిర్వాహకులతో కోఆర్డినేషన్ సమావేశాలు డీసీపీ, ఏసీపీ, సీఐ, ఎస్ఐ స్థాయిలో నిర్వహించడం జరిగిందని అన్నారు. వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసుకునేవారు అన్ని వివరాలతో సంబంధిత పోలీస్ స్టేషన్ లో సంప్రదించి తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలన్నారు. ఆన్లైన్ నమోదు చేసుకున్న వాటి వివరాల ఆధారంగా ఆన్లైన్ చేయడం విగ్రహాలకు జియో ట్యాగింగ్ చేస్తామని, కమిషన్ పరిధిలో ఎన్ని విగ్రహాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలుస్తుందని , నిమజ్జన సమయంలో ఎలాంటి అవాంతరాలు జరగకుండా శోభయత్ర సాఫీగా సాగేలా రూట్ మ్యాప్ ఏర్పాట్లు పర్యవేక్షిస్తామన్నారు. అదేవిధంగా కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో జరిగిన అల్లర్లను దృష్టిలో పెట్టుకొని రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో శుక్రవారం ముస్లిం ల నమాజ్ కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ముందస్తు చర్యలలో భాగంగా మసీదుల వద్ద బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మండపాల వద్ద ఎలాంటి డీజేలకు పర్మిషన్ లేదని భక్తికి సంబంధించిన పాటలే ఉండాలి తప్ప ఇతర మతాల వారిని, ఇతర వ్యక్తులను ఇబ్బంది పెట్టే విధంగా, కించపరిచే విధంగా, లా అండ్ ఆర్డర్ సమస్య తలెత్తే విధంగా ఎలాంటి గొడవలు జరిగిన చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకుంటామన్నారు. పెద్దపల్లి ప్రభుత్వ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహంని సందర్శించి, వినాయక మండప నిర్వాహకులతో సీపీ మాట్లాడారు.

సిపి వెంట పెద్దపల్లి సిఐ ప్రవీణ్ కుమార్, పెద్దపల్లి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ అనిల్ కుమార్, పెద్దపల్లి ఎస్ ఐ లక్ష్మణ్ రావు తదితరులు పాల్గొన్నారు.