అక్రమ దందా ఆగేదెట్లా

రంగంలోకి దిగిన సర్పంచ్ పాలకవర్గం.

అధికారుల కళ్ళు గప్పిన అక్రమార్కులు.

టిప్పర్ అద్దాలు ధ్వంసం చేసిన గ్రామ ప్రజలు

అనుమతులు గోరంత అక్రమాలు కొండంత.

అనుమతులకు మించి తీసిన మట్టిపై పెనాల్టీ వేయాలి.

అధికార యంత్రాంగం స్పందించకుంటే సహజ సంపద కరువవుతుంది.

అగ్నిధారన్యూస్ పెద్దపల్లి క్రైమ్
పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మండలం తురకల మద్దికుంట గ్రామంలో సర్వేనెంబర్ 390( అనుమతులు తీసుకున్న వ్యక్తి గట్ల విజయకుమార్ రెడ్డి) ( మట్టి తరలించే వ్యక్తి రామ్ రెడ్డి ? )లో మట్టి తవ్వకాల కోసం అనుమతులు తీసుకున్నారు. నిబంధన ప్రకారం సక్రమంగా తీసుకోవలసిన మట్టిని, అక్రమ దందాగా మార్చి అక్రమార్కులు సహజ సంపదను కొల్లగొడుతున్నారు. 18.08.2023 నుండి 17.8.2028 వరకు అనుమతులు ఉన్నాయి. అక్రమ మట్టి దందా గ్రహించి
తవ్వకాలను నియంత్రించే క్రమంలో పలుమార్లు సర్పంచ్ పాలకవర్గ సభ్యులు గ్రామ ప్రజలు మట్టి తవ్వకాల వద్దకు వెళ్లి అడగగా, మాకు అనుమతులు ఉన్నాయంటూ బుకాయిస్తూ, నిరంతరం తవ్వకాలు జరుపుతున్నారు. ఇక్కడ గ్రహించాల్సిన విషయం ఏంటంటే అనుమతులు ఉన్నాయి, లీజు టైం ఉన్నది, కానీ మట్టి తవ్వకాలకు 390 సర్వే నెంబర్లో తీసుకున్నా అనుమతులు 33010 మెట్రిక్ టన్నులు, తవ్వింది మాత్రం అనుమతులకు మించి 45441 మెట్రిక్ టన్నులు. అనుమతి తీసుకున్న సర్వే నెంబర్ లోనే అక్రమ తంతు ఇది అయితే…
పక్కనే ఉన్న మరో సర్వే సర్వేనెంబర్ లో మైనింగ్ అధికారుల ఎలాంటి అనుమతి లేకుండా తీసిన అక్రమ మట్టి 116080.5 మెట్రిక్ టన్నులుగా తెలుస్తుంది. ఇదే విషయమై గ్రామపంచాయతీ సర్పంచ్ రాజయ్య సోమవారం ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఈరోజు ఆదివారం కావడం అధికారులు లేకపోవడం ఆసరా తీసుకొని మరో మారు అక్రమార్కులు గుట్టను చెరిపే కార్యక్రమం పెట్టుకున్నారు. గమనించిన తురకల మద్దికుంట సర్పంచ్ గ్రామ పాలకవర్గం ప్రజలు టిప్పర్లను నడిరోడ్డు పైన నిలిపివేశారు.  మాట మాట పెరిగి రోడ్డు పైన ఉన్న టిప్పర్లను ప్రజలు ధ్వంసం చేశారు. పోలీస్ సిబ్బంది చేరుకొని పరిస్థితిని చక్క దిగుతున్నారు. ఇప్పటికైనా అధికారులు తురకల మద్దికుంట గ్రామంలో జరుగుతున్న మట్టి దందాపై దృష్టి సారించాలని ప్రజల డిమాండ్ చేస్తున్నారు.