అగ్నిధార న్యూస్, పెద్దపెల్లి జిల్లా:. ప్రజా సమస్యల పరిష్కారం కోసమే మార్నింగ్ వాక్
రామగుండం ఎమ్మెల్యే కోరు కంటి చందర్ అంటేనే ప్రజల మనిషి నిత్యం ప్రజల్లో ఉండే మనిషి అనేది జగమెరిగిన సత్యం అందుకు నిదర్శనమే ఆయనను ఆ ప్రాంత ప్రజలు గుండెల్లో పెట్టుకుని ఎవరికి తెలియని సింహం గుర్తు తో అందరికీ తెలిసేలా ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిపించారు అంటే అర్థం అవుతుంది తనేంటో తన సత్తా , వ్యక్తిత్వం ఏంటో ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత ప్రజలందరికీ దగ్గరగా ఉన్నప్పటికీ మరింత దగ్గరగా కావడానికి రామగుండం కార్పొరేషన్ పరిధిలో వార్డుల్లో ప్రజా సమస్యల పరిష్కారం కోసం మార్నింగ్ వాక్ కార్యక్రమాన్ని చేపట్టారు, ప్రతి డివిజన్లో సుందరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పాలన సాగిస్తున్నామని అన్నారు. శనివారం మార్నింగ్ వాక్ రెండో విడత కార్యక్రమాన్ని 33వ డివిజన్ లో ప్రారంభించారు. అనంతరం డివిజన్లోని గడపగడపకు వెళ్లి ప్రజలతో మాట్లాడుతూ వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రం ఎర్పాడిన తర్వాతరాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రివర్యులు కేటిఆర్ నాయకత్వంలో పట్టణాల అభివృద్ధి కి అధిక మెుత్తంలో నిధులు కేటాయించడం జరుగుతుందని ప్రభుత్వం కేటాయించిన నిధులను అభివృద్ధి పనులకు వెచ్చిస్తూ రామగుండం నగరాన్ని అభివృద్ధికి చిరునామాగా మార్చుతున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పట్టణ ప్రగతిలో భాగంగా ప్రజలకు మౌలిక వసతుల సౌకర్యాన్ని కల్పిస్తుందన్నారు. 2019వ సంవత్సరంలో మొదటి సారి మార్నింగ్ వాక్ కార్యక్రమానికి రామగుండం కార్పొరేషన్ పరిధిలో శ్రీకారం చుట్టనున్నారు . రెండవ విడత మార్నింగ్ వాక్ కార్యక్రమంలో ప్రజలను కలుసుకున్న సందర్బంలో మాకు రోడ్లు నిర్మాణం జరిగినవి… డైనేజీ వ్యవస్ధ బాగుందనీ …మంచీనీటి సమస్యలు లేవని తమ పాలన బాగుందని ప్రజలు చేప్పడం సంతోషంగా ఉందన్నారు. రామగుండం కార్పొరేషన్ ను సిద్దిపేట సిరిసిల్లా హైద్రాబాద్ వరంగల్ కరీంనగర్ నగరాల తరహా తీర్చిదిద్దడానికి మాస్టర్ ప్లాన్ రెడీ చేశామన్నారు. రామగుండం ప్రాంతానికి అన్ని రకాల సదుపాయాలను కల్పిస్తూ నగరాన్ని సుందరీకరణ చేస్తాం అన్నారు. రామగుండం ప్రాంత ప్రజలను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటూ ప్రజా సమస్యలన్నీ పరిష్కరిస్తామన్నారు.ఈ కార్యక్రమంలో రామగుండం నగర మేయర్ డాక్టర్ బంగీ అనిల్ కుమార్ డిప్యూటీ మేయర్ నడిపెల్లి అభిషేక్ రావు కార్పొరేటర్ , మరియు ప్రజా ప్రతినిధులు స్థానిక నాయకులు డివిజన్ వాసులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
