అగ్నిధార న్యూస్ ,మంథని:. తెరాస ప్రభుత్వందీ రైతుల పై కపట ప్రేమ
-బిజెపి రాష్ట్ర నాయకులు చంద్రుపట్ల సునిల్ రెడ్డి
తెరాస ప్రభుత్వందీ రైతుల పట్ల కపటి పేమ అని అన్నారు.శనివారం పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన సమావేశం లో ఆయన మాట్లాడుతూ తెరాస ప్రభుత్వం శుక్రవారం చేపట్టిన ధర్నా రైతుల పై మొసలి కన్నీరు కార్చడం మానుకోవాలని, రైతుల పై నిజంగా చిత్త శుద్ధి ఉంటె రైతులకు గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని గతంలో ఇదే ముఖ్య మంత్రి కెసిఆర్ మాట్లాడుతూ ప్రాజెక్టు ల వల్ల దాదాపు 2లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని కరోనా విపత్తు సమయం లో రాష్ట్ర ప్రభుత్వం కొని మిల్లరలను వాడుకొని ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేస్తామని గొప్పలు చెప్పిన కెసిఆర్ ఇప్పుడు ఎక్కడ పోయడాని, కేంద్రం ప్రభుత్వం ఇచ్చే పథకలకు ప్రధాని ఫోటో లేకుండా చేసి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నట్లు ప్రచారం చేసుకుంటున్నాడని, “సొమ్ము ఒకరిది సోకు ఒకరిది ” అన్నట్టు కెసిఆర్ పాలన ఉందని అన్నారు, గ్రామ గ్రామాన రోడ్లు, రైతు వేదికలు, స్మశాన వాటికలకు డబ్బులు కేంద్ర ప్రభుత్వ నిధులని, చేతకాని తెరాస ప్రభుత్వం బిజెపి పై విమర్శలు చేస్తుందని, తెరాస ప్రభుత్వం అధికారం లో ఉండి ధర్నా చేయడం సిగ్గు చేటు అని అన్నారు, నిల్వ ఉన్న ధాన్యాన్ని కొనకుండా యాసంగి వడ్ల కోసం ధర్నా చేయడం ఏంటని, ప్రాజెక్టు వల్ల నష్ట పోయిన రైతులను ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద తీసుకుంటా అని తీసుకోలేదని, మానేరు లో నిర్మించిన ఎనిమిది చెక్ డాంల వల్ల రైతులు నష్ట పోతారని వారి పక్షాన తర్వలో ధర్నా చేస్తామని ఆర్ అండ్ ఆర్ ప్యాకెజీ కోసం హై కోర్ట్ కి కూడా వెళతాం అన్నారు తెరాస ప్రభుత్వం ఒక్కసారి కొంటాం ఒకసారి కొనమని రైతు లని అయ్యో మాయనికి గురిచేస్తుందని అన్నారు .ఈకార్యక్రమంలో మండల అధ్యక్షులు వేల్పుల రాజు, టౌన్ ప్రెసిడెంట్ సదాశివ్, సీనియర్ నాయకులు రాపర్తి సంతోష్, బోగోజు శ్రీనివాస్, వేల్పుల సత్యం, కోరబోయిన మల్లికార్జున్, నాంపల్లి రమేష్, చిలువేరి సతీష్, సబ్బాని సంతోష్, పోతారవేణి క్రాంతికుమార్, రేపాక శంకర్ తదితరులు పాల్గొన్నారు..
