బిఆర్ఎస్ యూత్ మండల నాయకులు కూకట్ల నవీన్ యాదవ్.

అగ్నిధారన్యూస్ పెద్దపల్లి: బీఆర్ఎస్వీ పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఫీజు బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ చలో అసెంబ్లీకి పిలుపునివ్వగా మంగళవారం శ్రీ రాంపూర్ పోలీసులు బిఆర్ఎస్ యూత్ మండల నాయకులు కూకట్ల నవీన్ యాదవ్ ను ముందస్తు పోలీసులు అరెస్ట్ చేశారు…ఈ సందర్భంగా కూకట్ల నవీన్ యాదవ్ మాట్లాడుతూ అసెంబ్లీ ముట్టడి నేపథ్యంలో అర్ధరాత్రి అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాను అన్నారు… ఎవరైనా స్వేచ్ఛగా తమ నిరసనలు తెలుపవచ్చు అన్న సీఎం రేవంత్ రెడ్డి మాటలు, గాలికి వదిలారన్నారు… ఇలాంటి అప్రజా స్వామిక అక్రమ అరెస్టుల ద్వారా ప్రజా వ్యతిరేకత మూట కట్టుకోవాల్సి వస్తుందని అన్నారు. రాబోయే రోజుల్లో విద్యార్థుల నుండి ప్రజల నుండి ప్రభుత్వం తప్పించుకోలేదు అన్నారు. తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది అన్నారు. విద్యార్థి విభాగానికి ప్రభుత్వాలపై పోరాటం కొత్త కాదని విద్యార్థి విభాగం నుండి హెచ్చరించారు. నియంత పాలన ఎన్నో రోజులు నడపలేరు, ప్రభుత్వం వెంటనే మేల్కొని విద్యార్థుల ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేసి 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేసారు.

కాల్వ శ్రీరాంపూర్ లో బి ఆర్ ఎస్  యూత్ మండల అధ్యక్షుడు నవీన్ యాదవ్ పోలీసులు అదుపులోకి తీసుకున్న  దృశ్యం.