గంజాయి కేసులో కఠిన కారాగార శిక్ష

రెండు లక్షల భారీ జరిమానా విధించిన జిల్లా కోర్టు

అగ్నిధారన్యూస్ సుల్తానాబాద్ క్రైమ్

సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్ లో SI-2 గా పనిచేసిన పి. దేవేందర్ కానిస్టేబుల్స్ సాంబశివరావు, సంపత్, రమేష్ నాయక్ టాస్క్ ఫోర్స్ సీఐ సేరిలాల్, టాస్క్ ఫోర్స్ కానిస్టేబుల్ సురేందర్ మల్లేష్ లు సుల్తానాబాద్ స్థానిక చెరువు కట్ట దగ్గర 09/02/2019 నాడు వాహనాలు తనిఖీ చేస్తుండగా ఉదయం 09:30 గంటలకు కరీంనగర్ వైపు నుండి AP 28 CG 8441 నెంబర్ గల మారుతి సుజుకి SX4 కారులో నలుగురు వ్యక్తులు పోలీస్ బోర్డు పెట్టుకొని ఉన్న కారు తో ప్రయాణించారు. అనుమానంతో పోలీసులు వాహనాన్ని తనిఖీ చేయగా డిక్కీలో 67 కవర్లు గంజాయి ఉండడంతో సుల్తానాబాద్ ఎస్సై,తహసిల్దార్ కు సమాచారం అందించడంతో ఇరువురి సమక్షంలో పంచనామ నిర్వహించారు. గంజాయిని తూకం వేయగా 144 కిలోల వరకు ఉండడంతో కారులో ఉన్న గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న A1. రామ్ గుణాజీ, A2. సాయ్యేద్ హుసేన్సాబ్, A3. కేతావత్ మారుతీ, A4. జాదవ్ విజయ్ కుమార్లు గుర్తుతెలియని వ్యక్తుల వద్ద నుంచి గంజాయిని కొని వేరే వ్యక్తులకు ఎక్కువ డబ్బులు సంపాదించాలని గంజాయిని కారులో తరలిస్తున్నారని తాసిల్దారు పంచనామ రాసి పూర్తయిన తర్వాత ఎస్ఐ నలుగురు ముద్దాయిలను గంజాయిని కారును పోలీస్ స్టేషన్ కు తీసుకొని వెళ్లి అప్పటి ఎస్సై రాజేష్ కేసు నమోదు చేశారు. ముద్దాయిలను అరెస్టు చేసి రిమాండ్ కు పంపారు. అప్పటి సుల్తానాబాద్ CI. G. మహేందర్ రెడ్డి పరిశోధన ప్రారంభించి కేసు నమోదు చేసి చార్జ్ షీట్ కోర్టులో దాఖలు చేశారు. పెద్దపల్లి జిల్లా కోర్టు జడ్జి సునీత ముద్దాయిలు నేరం చేసినట్లు రుజువు కావడంతో మంగళవారం నలుగురు నేరస్తులకు పన్నెండు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష ఒక్కొక్కరికి రెండు లక్షల రూపాయల జరిమానా విధించారు.పెద్దపల్లి డిసిపి. B. రాoరెడ్డి, ఏసీపీ గజ్జి కృష్ణ,సాక్షులను ప్రవేశపెట్టడానికి సహకరించిన సీఐ G. సుబ్బారెడ్డి సుల్తానాబాద్ ఎస్సై P.చంద్రకుమార్, కోర్ట్ కానిస్టేబుల్ శ్రీనివాస్, పి.కోటేశ్వర రావు లను రామగుండం కమీషనర్ అంబర్ కిషోర్ ఝా ప్రాసిక్యూషన్ బృందానికి అభినందనలు తెలిపారు.