గ్రామాల్లో పనిచేయని సీసీ కెమెరాలు.
శాంతి భద్రతల నిర్వహణ నేరాల దర్యాప్తుల పై ప్రభావం.
పట్టించుకోని పోలీసు అధికారులు.
అగ్నిధారన్యూస్ సుల్తానాబాద్
ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానమని సీసీ కెమెరాలు ప్రాముఖ్యతను వివరిస్తూ ఆయా గ్రామాలలో అవగాహన నిర్వహిస్తున్నప్పటికీ సుల్తానాబాద్ మండల కేంద్రంలోని చాలా గ్రామాలలో నిఘా నేత్రాలు (సీసీ కెమెరాలు) పనిచేయడం లేదని ఆయా గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇటీవల కాలంలో ఓ గ్రామంలో గొర్రెల కాపరికి చెందిన సుమారుగా 15గోర్లు దొంగలించబడ్డాయని వీటి విలువ సుమారుగా లక్ష రూపాయల వరకు ఉంటుందని ఆయన ఆవేదన వ్యక్తం చెందారు. అయితే ఈ గ్రామంలో ఓ చిరు వ్యాపారి ఏర్పాటు చేసిన సీసీ కెమెరాతో పోలీసులు విచారణ ప్రారంభించారు.అలాగే సుద్దాల గ్రామంలోని గోదాముల వద్ద ఓ దాత సహకారంతో బిగించిన సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారని సుద్దాల గ్రామ సర్పంచ్ ఒజ్జ సంపత్ యాదవ్ తెలిపారు.ఈ సంఘటనతో నిఘా నేత్రాలకే నిఘా కరువైందని గ్రామ ప్రజలు చర్చించుకుంటున్నారు. దొంగలను గుర్తించాలన్న దోపిడీ దొంగల ఆట కట్టించాలన్న సీసీ కెమెరాలు పాత్ర ఎంతో ఉందని ఆయా గ్రామస్తుల ప్రజలు తమ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే టీజీఎస్పీడీఎల్ విద్యుత్ స్తంభాలపై ఉన్న ఇతర కేబుల్స్ ను తొలగించడంతోపాటు సీసీ కేబుల్స్ కూడా తొలగించడంతో అవి పని చేయకుండా పోయాయని, రోడ్ల తవ్వకాలలో కూడా కొన్ని గ్రామాలలో కేబుల్స్ కట్ అయ్యాయని ప్రజలు తెలిపారు. సుమారుగా గత ఆరు ఏడు ఏళ్ల క్రిందట బిగించిన పాత సీసీ కెమెరాల బాధ్యతను ఆయా గ్రామపంచాయతీలు నిర్వహణ లోపంతో పనిచేయడం లేదని రోడ్డు ప్రమాదాలు, చైన్ స్నాచ్చింగులు, దాడులు, హత్యోదాంతాల కేసుల్లో నేరస్తులను పట్టుకునేందుకు సీసీ కెమెరాల పాత్ర కీలకమని, విద్యుత్ స్తంభాలపై అక్రమ తీగలను తొలగించే సమయంలో వైర్ల తొలగింపు కారణాలతో సీసీ కెమెరాలు పనిచేయడం లేదని తెలుస్తోంది. సీసీ కెమెరాల ఏర్పాటు నిర్వహణ కోసం మండలంలోని ఆయా గ్రామపంచాయతీల్లో ప్రభుత్వ పరంగా ప్రత్యేక నిధులు కేటాయించడం లేదని, వేటి నిర్వహణ కోసం పోలీసు శాఖ కూడా సొంత నిధులు వినియోగించడం లేదని గతంలో సామాజిక బాధ్యతగా కొన్ని కార్పొరేట్ సంస్థలు, ఇతర సంఘాలు ఇచ్చిన విరాళాలతో గతంలో సిసి కెమెరాలు ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో రానున్న వేసవికాలంలో చాలామంది ప్రజలు పుణ్యక్షేత్రాలకు, వివాహాలకు వెళ్లాలంటేనే ఇంట్లో ఒకరిద్దరి ఉండాల్సి వస్తుందని, ఇప్పటికైనా పోలీసు ఉన్నత అధికారులు ఈ నిఘానేత్రాల నిర్వహణ బాధ్యత తీసుకోవాలనీ సుల్తానాబాద్ మండల గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
