అగ్నిధారన్యూస్ సుల్తానాబాద్

సుల్తానాబాద్ మండలం లొని కనుకుల గ్రామానికి చెందిన నలుగురు యువకులు జల్సాలకు అలవాటు పడి గత వారం రోజులుగా మండలంలోని వివిధ గ్రామాల్లో గొర్రెలు, కోళ్లు దొంగతనాలు చేస్తున్నారు . దీనిలో భాగంగా గత నెల ముప్పై ఒకటో తేదీన రాత్రి సమయంలో సుద్దాల గ్రామానికి చెందిన ఒజ్జె రాములు కి సంబంధించిన ఐదు గొర్రెలు ఈ నెల ఆరవ తేదీ రాత్రి సమయంలో చిన్న బొంకూర్ గ్రామంలో కల్వల లక్ష్మారెడ్డి మరియు మిగతా ముగ్గురు రైతుల దగ్గర దాదాపు 20 కోళ్లు దొంగతనం చేయడం జరిగింది. దీనిపై కేసు నమోదు చేసిన అనంతరం దర్యాప్తు చేసి కనుకుల గ్రామానికి చెందిన నలుగురు యువకులు సిరిపురం రాకేష్,నూనె అభిలాష్ ,గరిగంటి రాజకుమార్ మరియు ఒక మైనర్ అబ్బాయి ను అదుపులోకి తీసుకొని వారిని అరెస్టు చేయడం జరిగింది. వారి వద్ద నుండి దొంగతనానికి ఉపయోగించినటువంటి ఎర్టిగా వెహికల్ ను స్వాధీనం చేసుకోవడం జరిగిందనీ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సుల్తానాబాద్ ఎస్ఐ చంద్రకుమార్ తెలిపారు.