ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన గంట రాములు యాదవ్.

అగ్నిధారన్యూస్ పెద్దపల్లి జిల్లా ఆగస్ట్ 27:
గురువారం పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ సమీపంలో రాజీవ్ రహదారి పక్కన తెలంగాణ ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల, కార్మికులు తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి సంఘీభావంగా బిఆర్ఎస్ నాయకులు గంట రాములు యాదవ్ మహా ధర్నా కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు… ఉద్యోగుల పట్ల ప్రభుత్వం మొండివైఖరి అవలంబిస్తుందన్నారు. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లపై వెంటనే సానుకూలంగా స్పందించాలని డిమాండ్ చేశారు. పి ఆర్ సి అమలు, పెండింగ్‌లో ఉన్న ఆరు డి ఎ లు విడుదల చేయాలన్నారు. సమస్యలను పరిష్కరించనట్లయితే ఐక్యంగా మరో ఉద్యమానికి సిద్ధం కావాలని సూచించారు. ప్రభుత్వ ఉద్యోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వాన్ని రాబోయే అసెంబ్లీ సమావేశాలలో ప్రతిపక్ష పార్టీల నుండి నిలదీస్తామన్నారు. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లు  నెరవేరేవరకు తన మద్దతు ఉంటుందన్నారు.