అగ్నిధార న్యూస్ ( పెద్దపెల్లి  ):పెద్దపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కునారం రోడ్డు వద్ద   పెద్దపల్లి ఎమ్మెల్యే ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో కెసిఆర్ చిత్రపటానికి ఘనంగా పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెద్దపల్లి మండలాన్ని జిల్లాగా మార్చి పెద్దపల్లి నగర పంచాయతీ ని మున్సిపాలిటీ గా మార్చి పెద్దపెల్లి జిల్లా కి అభివృద్ధి ప్రదాత గా కెసిఆర్ చరిత్రలో నిలిచి పోతారు అన్నారు పెద్దపల్లి మున్సిపాలిటీకి 50 కోట్లు మిషన్ భగీరథ కి 32 కోట్లు ఇప్పుడు పెద్దపల్లి నుండి  కునారం వెళ్లే రోడ్డును ఫోర్ వే గా చేయడమే కాకుండా ఏళ్ల తరబడి పెద్దపల్లి నుండి కూనారం  రాకపోకలకు అడ్డంకిగా ఉన్న రైల్వే గేట్ పైన ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి వంద కోట్ల రూపాయలు నిధులు విడుదల చేసి ముఖ్యమంత్రి మరోసారి పెద్దపల్లి పైన ప్రజల పైన తనకు ఉన్న ఉదారతను చాటుకున్నారని అన్నారు.త్వరలోనే రైల్వే బ్రిడ్జి టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ఉప్పు రాజకుమార్  జెడ్ పి టి సి రామ్మూర్తి బండారి  శ్రీనివాస్ స్థానిక కన్సిలర్ లు సర్పంచులు ఎంపీటీసీలు నాయకులు టిఆర్ఎస్ పార్టీ నాయకులు.