అగ్నిధారన్యూస్( పెద్దపల్లి ):తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ దేశంలో ఎక్కడా లేని విధంగా పార్టీ కోసం పార్టీ కార్యకర్తల కోసం పార్టీ కార్యాలయాలను జిల్లాకు ఒకటి చొప్పున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రాలలో పార్టీ కార్యాలయాలను నిర్మిస్తున్నారు . ఇందులో భాగంగా పెద్దపల్లి జిల్లా గౌరీ రెడ్డి పేట శివారులో గల సువిశాలమైన ఒక ఎకరం 30 గంటల వైశాల్యంలో టిఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని నిర్మించబోతున్నారు. ఈ కార్యాలయాన్ని పెద్దపల్లి జిల్లా టిఆర్ఎస్ పార్టీ ఇన్చార్జ్ ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య స్థానిక ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి తో కలిసి సందర్శించి, జరుగుతున్న పనులను పరిశీలించారు .ఈ సందర్భంగా పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ పార్టీ కార్యాలయాన్ని సర్వాంగసుందరంగా దేశంలో ఎక్కడా లేని విధంగా అన్ని జిల్లాల్లో పార్టీ కార్యాలయాలను నిర్మిస్తున్నామన్నారు. కార్యాలయానికి వచ్చి పోయే కార్యకర్తలకు నాయకులకు ప్రజలకు ఆహ్లాదకర వాతావరణాన్ని కల్పించే విధంగా పార్టీ కార్యాలయం నిర్మాణం ఉండబోతుంది అన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అనేక సంక్షేమ కార్యక్రమాలు కార్యాలయంలో దర్శనం ఇవ్వబోతున్న అన్నారు .పార్టీ కార్యాలయం సర్వాంగ సుందరంగా నిర్మించబడుతుంది అన్నారు. ఈ కార్యక్రమంలో బండారు శ్రీనివాస్ రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు అనంతరెడ్డి సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షులు ఎనగందుల శంకరయ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.
