అగ్నిధారన్యూస్(  పెద్దపల్లి  ):పెద్దపల్లి    సోమవారం    పెద్దపల్లి మండలం రాగనేడు గ్రామంలో ,నివాసం ఉండే ప్రైవేట్ పాఠశాలలో పనిచేసే గణిత ఉపాధ్యాయుడు, వైద్య ఖర్చులకు, శ్రీ ఆదర్శ పాఠశాల,బ్రహ్మణపల్లి కరెస్పాండెంట్ చిప్ప భాస్కర్ దృష్టికి లయన్స్ క్లబ్ ఆఫ్ తెలంగాణ ఐ కేర్ అధ్యక్షులు పూదరి దత్తాగౌడ్ , రూ.5016 ఆర్ధిక సహాయం వైద్య ఖర్చులకు నగదు అందజేశారు. వివరాలు గణిత ఉపాధ్యాయుడు పడాల కుమార్ గౌడ్ ఊరు నుండి వచ్చే సమయంలో, రోడ్డు ప్రమాదంలో, గాయపడి కాలులో ఉండే ఎముకలు,చెయ్యి రెండుగా విరిగింది. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ, కాలు చెయ్యి ఆపరేషన్‌ చేయించుకున్నారు. డాక్టర్లు ఆరు నెలలు విశ్రాంతి తీసుకోవాలని చెప్పారు. ఆర్థిక సహాయం అందించినందుకు గాను, కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.