■  చక్రం తింపిన కోరుకంటి చందర్.

■  అగ్నిధార చెప్పిందే జరిగింది.

■  రామగుండం నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీ కీ భారీ షాక్.

■   అంతర్గాం కాంగ్రెస్ పార్టీ  మండల అధ్యక్షులు మెరుగు పోశం.

పాలకుర్తి కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు గంగాధర రమేష్.

■  యూత్ అధ్యక్షులుమాదాసు శ్రావణ్ 

కోరుకంటి  చందర్  సమక్షంలో తెరాస లో చేరిక

■  రామగుండంలో  నెక్స్ట్ ఆపరేషన్ కార్పొరేషన్…..

అగ్నిధారన్యూస్ రామగుండం // మునుగోడు   రామగుండం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. పాలకుర్తి ,అంతర్గాం మండలాలకు చెందిన  కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, యూత్ అధ్యక్షులు  ఆదివారం బంగారుగడ్డలో రామగుండం శాసన సభ్యులు కోరుకంటి చందర్  సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. సందర్భంగా వారు మాట్లాడుతూ
తాము నమ్ముకున్న ప్రజలకు న్యాయం చేయాలంటే గత 20 సంవత్సరాలుగా  కాంగ్రెస్ పార్టీలో ఉండి పార్టీకి ప్రజలకు సేవలు చేసినప్పటికీ ప్రజలకు మరిన్ని సేవలు చేయాలంటే తెరాస పార్టీతో   మంత్రి  కొప్పుల ఈశ్వర్ రామగుండం శాసనసభ్యులు కోరుకంటి చందర్  నాయకత్వం లో సాధ్యమవుతుందని  మెరుగు పోశం,గంగాధర. రమేష్, .గ్రహించమన్నారు. మమ్మల్ని నమ్ముకున్న  ప్రజలకి న్యాయం  చేయాలంటే అభివృద్ధి పథంలో నియోజకవర్గాన్ని తీసుకెళ్తున్న ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తోనే సాధ్యమని గ్రహించి నమ్ముకున్న ప్రజల అభిప్రాయాలను,ఎమ్మెల్యే  పిలుపు మేరకు సిఎం కెసిఆర్ పాలన ఆకర్షితులై  టీఆర్ఎస్ పార్టీలో చేరామన్నారు.

రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ 

తెలంగాణ రాష్ట్రంలో సిఎం కెసిఆర్  అమలు చేస్తున్న ప్రజాహిత  సంక్షేమ పథకాలకు ఆయన పాలనకు ఆకర్షితులై టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు.
ఆదివారం మునుగోడు నియోజకవర్గం చండూరు మండలం బంగారు గడ్డలో కాంగ్రెసు పార్టీ పాలకుర్తి, అంతర్గాం, మండల అధ్యక్షులు మెరుగు పోశం, గంగాధర రమేష్, యూత్ అధ్యక్షులు మాదాసు శ్రావణ్  లు చందర్  సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు  ఎమ్మెల్యే వారికి గులాబీ  కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ... ప్రతి ఇంటికీ సంక్షేమం అందిస్తూ ప్రతి ముఖంలో ఆనందం నింపుతున్న ఘనత  రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దే అన్నారు. దేశం లో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ అభివృద్ధి పథకాలను అమలు చేస్తోంది తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం అన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాష్ట్ర ఐటి మున్సిపల్ శాఖ మంత్రి కేటిఆర్ , కోప్పుల ఈశ్వర్ ,నేతృత్వంలో రామగుండం నియోజకవర్గం ప్రజలకు మేరుగైనా సేవలందించడం జరుగుతుందన్నారు. .రానున్న రోజుల్లో మరింత ఉత్సాహంతో నియోజకవర్గాన్ని అభివృద్ధి ప్రయాణంలో తీసుకెళ్తానని తెలిపారు.
ఈ కార్యక్రమం లో కొత్తపల్లి సర్పంచ్ శ్రీనివాస్  టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ఉన్నారు.