■  టిపియుఎస్ జిల్లా అధ్యక్షుడిగా సునీల్ రెడ్డి.

■  జిల్లా ప్రధాన కార్యదర్శిగా దుగ్యాల శ్రీనివాస్ రావు

■  గౌరవాధ్యక్షులుగా పాకాల విజెందర్ రెడ్డి,

అగ్నిధారన్యూస్ పెద్దపల్లి: తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ( టిపియుఎస్) తపస్ పెద్దపల్లి జిల్లా నూతన అధ్యక్షుడిగా ముస్కుల సునీల్ రెడ్డి ఎన్నికయ్యారు. పెద్దపల్లి గాయత్రి పాఠశాల ఆవరణలో ఈ సమావేశంలో జిల్లా శాఖ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఎన్నికకు రాష్ట్ర పరిశీలకులు  సత్యనారాయణ, ఎన్నికల అధికారులుగా గంధం రవిందర్, చంద్రశేఖర్ ఆధ్వర్యంలో జిల్లా శాఖను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శిగా దుగ్యాల శ్రీనివాస్ రావు, గౌరవాధ్యక్షులుగా పాకాల విజెందర్ రెడ్డి, ఆర్థిక కార్యదర్శిగా కన్నోజు రామేశ్వర్, ఉపాద్యాక్షులుగా తక్కల్లపల్లి రాజేశ్వరరావు, లింగం శ్రీనివాస్, బొబ్బల ఉమాపతి రెడ్డి, జాడి మహేష్, సిహెచ్ శ్రీకాంత్ రెడ్డి, కె.నీరజ, సహాద్యక్షులుగా ఎలగం కనకయ్య, బెల్లంకొండ గిరిధర్ రెడ్డి, గుండవేన జగన్, చెన్నమనేని దిలీప్, సింగిరెడ్డి నరేష్ రెడ్డిలు, జిల్లా కార్యదర్శులుగా బోనాల రవిందర్, రఘోత్తం రెడ్డి, పుల్లూరి గీతాదేవి, సదానందం, డి.జైపాల్ రెడ్డి, మహిళాప్రముఖ్ గా మిట్ట సుమిత్ర, క్రీడా కన్వీనర్ గా ఏ. రాజేందర్, సాంస్కృతిక కన్వీనర్ గా కె రవి, సోషల్ మీడియా కన్వీనర్ గా తూర్పాటి చంద్రశేఖర్, మీడియా కన్వీనర్ గా తూర్పాటి సంపత్ కుమార్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. సంఘం రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి బండి రమేష్ హాజరై నూతన కమిటిని అభినందించారు. ఈకార్యక్రమంలో వివిధ మండలాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మండల కార్యవర్గ సభ్యులు, ప్రాథమిక సభ్యులు పాల్గొన్నారు. అనంతరం నూతన కార్యవర్గంచే ప్రమాణ స్వీకారం చేయించారు.