అగ్నిధారన్యూస్ (పెద్దపల్లి)నిర్మాత మర్కు లక్ష్మన్ సారధ్యంలో నిర్మితమైన పాపిష్టి మొగుడు షార్ట్ ఫిల్మ్ శనివారం విడుదల అయ్యింది. పెద్దపల్లి జడ్పిటిసి బండారు రామ్మూర్తి యూట్యూబులో విడుదల చేసిన అనంతరం మాట్లాడుతూ, ప్రస్తుత సమాజంలో భార్యాభర్తల మద్య జరుగుతున్న నిజ సంఘటనలను ఈ సినిమాలో కనులకు కట్టినట్లు చూపించారని తెలిపారు. గ్రామాల్లో సైతం మంచి ప్రతిభ గల కథానాయకులు ఉన్నారనే విషయం సోషల్ మీడియా ద్వారా ప్రతీ ఒక్కరికి తెలిసిందని, ఇందులో ప్రధాన పాత్రలను పోషించిన నటులు జాతీయ స్థాయి నటన ప్రదర్షించారని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో తారాగణం రాపెల్లి కుమార్ పటేల్, బాలునాయక్, అక్కె భాస్కర్, పూసాల సాయి, సంధ్యా రమేష్, గౌతం, కుమార్ పటేల్, గోలి తిరుపతి పటేల్, మస్టర్ అక్షిత్, తైవ అధ్యక్షుడు మంద భస్కర్ యాదవ్, ప్రధాన కార్యదర్శి గురుమూర్తి, తదితరులు పాల్గొన్నారు.