అగ్నిధార న్యూస్ “(సంగారెడ్డి )” సంగారెడ్డి జిల్లా అక్టోబర్ 17 అగ్నిధార తెలుగు దిన పత్రికలో కేతకి దేవాలయానికి పాలకమండలి మోక్షం ఎప్పుడో ? అనే కథనంతో వార్త ప్రచురితమైన విషయం విధితమే అదేవిధంగా ఆలయంలో జరిగే విషయాలపైన సమగ్ర విషయాలను అగ్నిధార ప్రచురించింది. ఆలయానికి పాలకమండలి అవసరం ఎంతో తెలిపింది. అగ్నిధార కథనానికి స్పందనగా 2022 అక్టోబర్ 22 రోజున దేవాలయానికి పాలకమండలని నియమించారు. వివరాలు.. జహీరాబాద్ నియోజకవర్గం ఝరాసంగం మండల కేంద్రంలోని  కేతకి సంగమేశ్వర స్వామి దేవస్థానం నూతన పాలకమండలి జహీరాబాద్ శాసనసభ్యులు కోనింటీ మాణిక్ రావు పాలకమండలి ఛైర్మన్ గా నీల వెంకటేశం‌ గుప్తాను సభ్యులను నియమించారు.అనంతరం ఆలయంలో సంప్రదాయ రీతిలో నిర్వహించిన పూజ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాణిక్ రావు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ పెంట రెడ్డీ, సర్పంచ్ ఫోరమ్ అద్యక్షులు జగదీశ్వర్, మండల ప్రధాన కార్యదర్శి నర్సింలు, మాజీ ఎంపీపీ విజయ్ కుమార్, మాజీ మున్సిపల్ చైర్మన్లు మంకల్ సుభాష్, అల్లాడి నర్సింలు, ముర్లికృష్ణ గౌడ్, మాజీ మార్కెట్ చైర్మన్ గుండప్ప, మాజీ ఆత్మ చైర్మన్ రామకృష్ణ రెడ్డీ, నాయకులు సంతు పటేల్, నాగన్న, సిద్ధన్న, మాజీ సర్పంచ్ వెంకటేశం, శ్రీకాంత్ రెడ్డీ, రంగా అరుణ్ ఆలయ ఈవో అధికారులు  తదితరులు పాల్గొన్నారు.