ప్రభుత్వ భూములతో పాటు సామాన్యుల భూములకు ఎసరు పెట్టిన కబ్జాకోరులు..
మంత్రి అనుచరుల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది..
వాటాలు తీసుకుంటూ భూకబ్జాదారులకే వంతపాడుతున్న అధికారులు..
భూమాఫియాకు కేరాఫ్ అడ్రస్ గా మారిన కరీంనగర్..
కరీంనగర్ భూమాఫియా పై గవర్నర్ కు ఫిర్యాదు చేస్తాం..
బీజేపీ రాష్ట్ర నాయకులు బేతి మహేందర్ రెడ్డి.
అగ్నిధారన్యూస్( కరీంనగర్ )కరీంనగర్ నగరం చుట్టూ ఉన్న గ్రామాలను కార్పొరేషన్ లో విలీనం చేసిన క్రమంలో భూములకు రెక్కలు రావడంతో భూకబ్జాదారులు, బడా బాబులు పాగా వేసి ప్రభుత్వ భూములు, ఎస్.ఆర్.ఎస్.పి భూములు, సామాన్యుల పట్టా భూములకు ఎసరు పెట్టిన వారి పై కఠినంగా వ్యవహారించాల్సిన మంత్రి గంగుల కమలాకర్ కబ్జాకోరులకే కొమ్ముకాస్తున్నారని బీజేపీ రాష్ట్ర నాయకులు, కరీంనగర్ నియోజకవర్గ నాయకులు బేతి మహేందర్ రెడ్డి ఒక ప్రకటనలో ఘాటుగా విమర్శించారు. గత కొన్ని నెలలుగా కార్పొరేషన్ పరిధిలో ప్రతి రోజు నగరంలోని సామాన్య ప్రజల పట్టా భూములతో పాటు నగరం చుట్టూ ఉన్న ప్రభుత్వ, ఎస్.ఆర్.ఎస్.పి భూములను స్వాహా చేస్తున్న వారిలో టి.ఆర్.ఎస్ నాయకులతో పాటు, మంత్రి అండదండలతో బడా నాయకులమని అక్రమ డబ్బుతో చెలామణి చేసుకుంటున్న కొంతమంది పెద్ద మనుషుల ముసుగులో ఏ ఒక్క భూమిని వదలకుండా గ్రూప్, గ్రూపులుగా ఏర్పడి ఎక్కడ పడితే అక్కడ గుండాలను మొహరించి భూకబ్జాలు చేస్తూ బెదిరింపులకు పాల్పడుతూ సామాన్య ప్రజల స్థిరస్థులను, ప్రభుత్వ ఆస్తులను కొల్లాగొడుతుంటే మంత్రి ఎందుకు నోరు విప్పట్లేదని బేతి మహేందర్ రెడ్డి తీవ్రంగా ఆరోపించారు. సామాన్య ప్రజల ఆస్తులకు అండగా ఉండి రక్షణ కల్పించాల్సిన జిల్లా మంత్రి కబ్జాకోరులకే అండగా ఉంటూ వారికే మద్దతిస్తూ సామాన్యుల పాలిట శాపంగా మారినారని బేతి మహేందర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. వీరి వ్యవహార శైలితో విసుగు చెంది అన్యాయం జరిగిందని ఫిర్యాదు చేయడానికి వెళ్తే అక్కడ సెటిల్మెంట్ చేసుకొండ్రి, వాళ్లు పెద్ద వాళ్లు, వాళ్లతో మీరేమి కొట్లాడుతారు, మీకు అంత శక్తి లేదు, మీరు వాళ్లతో రాజీ చేసుకోకుంటే మీరే నష్టపోతారని, కోర్టుల చుట్టూ తిరగటం తప్ప మీకు అక్కడేమి న్యాయం జరగదని, మళ్లీ మీ భూములకు ప్రొటెక్షన్ కోసం మీరు మా దగ్గరికే వస్తారని బెదిరిస్తూ, ఒకవేళ మాకు చెప్పకుండా మొఖ మీదికి వెళ్తే మీ పైనే చర్యలు తీసుకోవాల్సి వస్తుందని అధికారులు ఛాంబర్లలో సామాన్యులను బెదిరిస్తున్నారని బేతి మహేందర్ రెడ్డి వాపోయారు. కరీంనగర్ లో జరుగుతున్న అక్రమ భూమాఫియా పై పూర్తి ఆధారాలతో నివేదిక తయారు చేసి సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టే విధంగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ కి బీజేపీ పార్టీ పక్షాన ఫిర్యాదు చేయనున్నట్లు, బేతి మహేందర్ రెడ్డి స్పష్టం చేశారు.
