అగ్నిధారన్యూస్ (పెద్దపల్లి) పెద్దపులి మరణం వదంతులు  సోషల్ మీడియాలో వస్తున్న పోస్టులు ఫేక్ న్యూస్ అని ఫారెస్ట్ అధికారి మంగిలాల్, రైల్వే పోలీస్ అధికారులు తెలిపారు. పెద్దపెల్లి జిల్లా పెద్దపల్లి కొత్తపల్లి మధ్య గల రైల్వే లైన్ లో పెద్దపులి రైలుకు తగిలి మరణించిందని వస్తున్న వదంతులు నమ్మవద్దని ఎక్కడొ మహారాష్ట్రలో చనిపోయిన పులికి సంబంధించిన ఫోటోలను ఇక్కడే చనిపోయిందని పోస్ట్ చేయడంతో జిల్లాలో ఒకసారిగా కలకలం చెలరేగింద. గత పది రోజులుగా పెద్దపల్లి జిల్లాలో సంచరించిన పులి నిన్న,మొన్న దస్తగిరిపల్లి, కొత్తపల్లి పరిసర ప్రాంతాల్లో కదిలాడిన పెద్దపులి  చనిపోయింది,అనుకొని అధికారులు, ప్రజలు ఒక్కసారిగా ఆందోళన చెందారు. కాని ఈ ప్రాంతంలో సంచరించిన పెద్దపులి సేఫ్ గా ఉండడంతో అధికారులు, ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.