అగ్నిధారన్యూస్(ఎన్టిపిసి క్రైమ్) రామగుండం నియోజకవర్గం ఎన్ టి పి సి టౌన్షిప్ లో భార్య చేతిలో భర్త హత్యకు గురైన సంఘటన జిల్లాలో కలకలం సృష్టిస్తుంది. ఎన్ టి పి సి డి4- 27 సర్వెంట్ క్వార్టర్లో నివాసముంటున్న చిలుముల స్పందన తన భర్త సుమన్ గత కొద్దికాలంగా కలహాలు పెట్టుకొని శుక్రవారం ఉదయం కూడా ఇద్దరి మధ్య ఘర్షణ తలెత్తడంతో తన భర్త తలపై ఇటుక పెళ్లతో గట్టిగా కొట్టడంతో సుమన్ అక్కడికక్కడే మృతి చెందినట్లు ఎస్ ఐ జీవన్ తెలిపారు. మృతుడి తల్లిదండ్రులు చిలుముల మదనయ్య- మల్లమ్మ, ముగ్గురు చెల్లెల్లు ఉన్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఎన్ టి పి సి సీఐ  లక్ష్మీనారాయణ పర్యవేక్షణలో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు సుమన్ ప్రతిరోజు కూలి పని చేస్తూ జీవనం సాగిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. గతంలో మృతుడు సుమన్ కి అంజలి అనే యువతీతో వివాహం జరిగినట్లు, తెలిపారు. స్పందనకు కూడా ఇంతకుముందే వేరే వ్యక్తితో వివాహం జరిగినట్లు సమాచారం. ఇద్దరూ తమ తమ భార్య భర్తలను వదిలి ఎన్ టి పి సి సర్వెంట్ క్వాటర్స్ లో వివాహం చేసుకొని  ఉంటున్నారు.