■  అగ్ని ధార కథనానికి స్పందన.

■  స్పందించిన అధికారులకి వందనం.

అగ్నిధారన్యూస్ ( పెద్దపెల్లిటౌన్ ) పెద్దపల్లి జిల్లా 2022 అక్టోబర్ 18 మంగళవారం రోజు అగ్నిధార పత్రికలో, వచ్చిన ప్రమాదకరంగా డివైడర్లు పట్టించుకోని అధికారులు అనే కథనానికి పెద్దపల్లి ట్రాఫిక్ పోలీస్ అధికారులు స్పందించి రంగంపల్లి నుండి కలెక్టరేట్  వెళ్లే రహదారి మార్గంలో గల కూల్చివేసిన డివైడర్ స్థానంలో తాత్కాలికంగా ట్రాఫిక్ నియంత్రణ బోర్డులు నిర్మాణం చేశారు. ఈ సందర్భంగా పెద్దపల్లి ట్రాఫిక్ సిఐ అనిల్ కుమార్ అగ్నిధార మాట్లాడుతూ వారం రోజులలో పూర్తిస్థాయి మరమ్మత్తులు చేపట్టి డివైడర్ ను పు:నర్నిర్మానం చేయనున్నట్లు తెలిపారు. వెంటనే స్పందించిన అధికారులకి పలువురు ప్రయాణికులు  ధన్యవాదాలు తెలిపారు .ఎలాంటి ప్రమాదాలు జరగకముందే  చర్యలు చేపట్టిన పెద్దపల్లి ట్రాఫిక్ పోలీసులకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

­