ఉదాత్తమైన ఆశయం ఉత్తదైన వైనo

ఆరంభ సూరత్వం

ఏళ్లు గడిచిన పూర్తిగాని నిర్మాణం

నాసిరకం ఇసుక నాణ్యత లోపం

ప్రమాదకరంగా మారిన రైల్వే పట్టాలు

జెసిపి తో  నీళ్లు తీస్తున్న వైనం

అగ్నిధార స్పెషల్ రిపోర్ట్

అగ్నిధారన్యూస్ (పెద్దపల్లిజిల్లా) పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మండలం కొత్తపల్లి గ్రామంలో గత రెండు సంవత్సరాల కాలం గా నిర్వహిస్తున్న అండర్ గ్రౌండ్ రైల్వే బ్రిడ్జి నత్తనడకన పనులు నడుస్తున్నాయి పర్యవేక్షించాల్సిన అధికారులు పట్టించుకున్న పాపాన పోవడం లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి కాంట్రాక్టర్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ రైల్వే అండర్ గ్రౌండ్ బ్రిడ్జి నిర్మాణం చేపడుతున్నారని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి నల్ల ఇసుకతో నాసిరకం పనులతో నాణ్యత లోపంతో సైడ్ వాల్స్ నిర్మిస్తున్నారనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. పెద్దపల్లి, పెద్దకల్వల, పెద్ద బొంకూర్, దస్తగిరి పల్లె ,కొత్తపల్లి ,కొలనూర్, కాల్వ శ్రీరాంపూర్, వెళ్లడానికి ప్రధాన రహదారి కావడం చేత నిత్యం వందలాది వాహనాలు ఈ మార్గం గుండా ప్రయాణిస్తూ ఉంటాయి .

ఈ మార్గమధ్యంలో కొత్తపల్లి వద్ద రెండు 36, 37 రైల్వే గేట్లు ఉన్నాయి. నిత్యం వాహనదారుల రద్దీని దృష్టిలో పెట్టుకొని రైల్వే అధికారులు.36 గేటును అండర్ గ్రౌండ్ బ్రిడ్జికి అనుమతులు ఇచ్చారు.ఆ కాంట్రాక్టు వరంగల్ కు చెందిన కాంట్రాక్టర్ గత రెండు సంవత్సరాల క్రితం దక్కించుకొని నేటి వరకు పూర్తి చేయకపోవడం సర్వత్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. గత వారం రోజుల నుండి వరుసగా కురుస్తున్న వర్షాలకు అండర్ గ్రౌండ్ బ్రిడ్జి మొత్తం మునిగిపోయింది. నీరు రైల్వే ట్రాక్ వరకు రావడంతో ప్రమాదకర పరిస్థితిలోకి ట్రాక్ చేరుకుంది, అదేవిధంగా పక్కనే బ్రిడ్జిని ఆనుకొని ఉన్న ఇండ్లలో నివసించేవారు, ఏ క్షణమైనా ఇండ్లు కూలే ప్రమాదం ఉందనే భయాందోళనతో, బిక్కు బిక్కు మంటూ, ప్రాణాలు అరిచేతుల్లో పెట్టుకొని ఆందోళన చెందుతున్నారు.. రైల్వే అండర్ గ్రౌండ్ బ్రిడ్జి ఆదిలోనే  ఇన్ని ఇబ్బందులు ఉంటే ప్రారంభించిన తర్వాత ఎన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందో అని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు గాని, పెద్దపల్లి జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే గాని నిర్మాణ పనులు జరుగుతున్న స్థలాన్ని సందర్శించి పనులను పరిశీలించి,న్యాయం చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.